Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా “గుంటూరు కారం” సంక్రాంతి పండుగకు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చాలాకాలం తర్వాత ఈ సినిమాలో మహేష్ సిగరెట్ తాగుతూ కనిపిస్తూ ఉండటం తోపాటు మాస్ గా కనిపించడంతో అంచనాలు ఉన్నా కొద్ది పెరుగుతూ ఉన్నాయి. ఈ సినిమాలో మొదట పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన తర్వాత మధ్యలోనే ప్రాజెక్ట్ నుండి బయటికి వెళ్లిపోయింది. దీంతో మహేష్ సరసన సెకండ్ హీరోయిన్ అనుకున్న శ్రీ లీల.. మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. మీనాక్షి చౌదరి రెండో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇంకా ఈ సినిమాలో జగపతిబాబు, జయరాం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్, బ్రహ్మానందం, మహేష్ ఆచంట కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12వ తారీకు ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ప్రచారంలో భాగంగా ఇప్పటికే విడుదలైన కొన్ని ఫోటోలు.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ సాంగ్ విడుదల వివరాలు నిర్మాత నాగ వంశీ అప్ డేట్ ఇవ్వటం జరిగింది. “గుంటూరు కారం” మూవీ ఫస్ట్ సింగల్ రిలీజ్ తారీకును దసరా రోజున లేకపోతే అంతకుముందే ప్రకటిస్తామని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ గతంలో రెండు సినిమాలు చేయడం జరిగింది. అతడు, ఖలేజా.. ఈ రెండు సినిమాలలో మహేష్ బాబుని చాలా వైవిధ్యంగా చూపించారు.
పైగా త్రివిక్రమ్ పంచ్ డైలాగులను పలకటంలో మహేష్ స్పెషలిస్ట్. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడు సినిమా “గుంటూరు కారం” పై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఏడాదిలో విడుదల కావలసి ఉంది. కానీ సినిమా షూటింగ్స్ అనేకమార్లు వాయిదా పడటంతో పాటు కొంతమంది మధ్యలోనే వెళ్లిపోవడంతో… ఆలస్యం కావడం జరిగింది. కానీ ఈసారి సంక్రాంతికి పక్కాగా జనవరి 12వ తారీకు “గుంటూరు కారం” విడుదల కాబోతున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.