NewsOrbit
Entertainment News సినిమా

Dum Masala: మహేష్ బాబు “గుంటూరు కారం”.. “దమ్ మసాలా” సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్..!!

Share

Dum Masala: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న “గుంటూరు కారం” సినిమా నుండి ఫస్ట్ సింగల్ లిరికల్ వీడియో రిలీజ్ అయింది. “దమ్ మసాలా” అంటూ విడుదలైన ఈ సాంగ్ లో సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఏ విధంగా ఉందో చూపించడం జరిగింది. తమన్నా అందించిన బాణీలకు రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం అభిమానులను ఎంతగానో ఆకట్టుగా ఉంది. “దమ్ మసాలా” లిరికల్ వీడియోనీ మహేష్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తమన్ అందించిన బాణీలు పెద్దగా కొత్తగా ఏమీ అనిపించలేదు. ఈ లిరికల్ వీడియోలో పూర్తిగా మహేష్ బాబుని చాలా కొత్తగా మాస్ పాత్రలో త్రివిక్రమ్ చూపిస్తున్నాడు.

Mahesh Babu Guntur Kaaram movie Dum Masala Song Lyrical Video Release

పైగా చాలా సంవత్సరాల తర్వాత “గుంటూరు కారం”లో మహేష్ స్మోకింగ్ చేయడంతో.. అభిమానులకు సినిమాపై ఆసక్తి పెరిగింది. అతిధి సినిమా తర్వాత మహేష్ స్మోకింగ్ చేస్తూ ఏ సినిమాలో కనిపించలేదు. అంతే కాదు ఆ టైంలో స్మోకింగ్ పూర్తిగా మానేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు గుంటూరు కారంలో సినిమా పాత్ర నిమిత్తమే మహేష్ బీడీలు తాగినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించడం జరిగింది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా గుంటూరు కారం విడుదల కాబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో మహేష్ నటించిన “అతడు” ఇంకా “ఖలేజా” రెండు కూడా.. మహేష్ నటనలో కొత్త కోణాలను చూపించాయి.

Mahesh Babu Guntur Kaaram movie Dum Masala Song Lyrical Video Release

“అతడు”లో మహేష్ చాలా సైలెంట్ ప్రొఫెషనల్ కిల్లర్ పాత్రలో కనిపించగా ఖలేజాలో.. పూర్తి కామెడీ పాత్రలో మెప్పించాడు. మహేష్ కెరియర్ మొదల నుండి ఖలేజా.. విడుదల అవ్వకముందు వరకు పెద్దగా కామెడీ చేసిన సినిమాలు లేవు. దీంతో మహేష్ కామెడీ చేయలేడని అపవాదు ఉండేది. కానీ మహేష్ “ఖలేజా”తో.. తనలో ఉన్న కామెడీ హ్యూమర్ ని అద్భుతంగా తెరపై పండించడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు “గుంటూరు కారం” లో మహేష్ ని త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.


Share

Related posts

OTT Releases: ఈ మే 20 సినీ ప్రియుల‌కు మ‌రింత స్పెష‌ల్ కావ‌డం ఖాయం!

kavya N

Krishna Mukunda Murari: కృష్ణ మురారిని విడదీయడానికి మరో బంపర్ ప్లాన్ వేసిన ముకుంద..!

bharani jella

రివ్యూ : సూపర్ ఓవర్

siddhu