సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ. అది హీరో..హీరోయిన్..మ్యూజిక్ డైరెక్టర్…ఇలా ఎక్కువగా కాంబినేషన్స్ మీద లక్ అన్న పదం, సెంటిమెంట్స్ అన్న పదం బాగా వినిపిస్తుంటుంది. అందుకే కొంతమంది హీరోయిన్స్ తమ పేరులో అక్కరాలని చేర్చుకోవడం వంటివి చేస్తుంటారు. ఈ విషయంలో హీరోలు మినహాయింపేమి కాదు. ఇక త్రివిక్రం లాంటి వాళ్ళు అల వైకుంఠపురములో ఇంగ్లీష్ టైటిల్ లో రెండు అక్షరాలను అదనంగా చేర్చారు. దాంతో సినిమా ఇండస్ట్రీ రికార్డ్ ని సాధించింది.
ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి సెంటిమెంట్స్ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా తను నటించే సినిమాలకి ఎక్కువగా ముడు అక్షరాలు ఉండే టైటిల్స్ నే ఎంపిక చేసుకుంటుంటాడు. మురారి, పోకిరి, మహర్షి, అతడు, దూకుడు..ఇలా ఎక్కువ సినిమాలు మూడు అక్షరాలతోనే ఉంటాయి. అయితే తన మొదటి సినిమా రాజ కుమారుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అయితే తాజాగా మహేష్ బాబు కి టైటిల్ సెంటిమెంట్ తో పాటు ఒక నటుడుని సెంటిమెంట్ గా ఫీలవుతున్నాడు.
అతనే బ్రహ్మజీ. మహేష్ బాబు సినిమాలో బ్రహ్మాజీ నటించినవన్ని 99శాతం విజయం సాధించాయని మహేష్ స్వయంగా వెల్లడించాడు. భరత్ అనే నేను చిత్ర విజయం తర్వాత కూడా మహేష్ ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పాడు. దాంతో మరోసారి మహేష్ బాబు నటించే సర్కారు వారి పాట లో బ్రహ్మజీ నటిస్తాడని అర్థమవుతుంది. నటుడు విషయం అలా ఉంచితే టైటిల్ విషయంలో మూడు అక్షలు కాకుండా సర్కారు వారి పాట అంటూ 7 అక్షరాలు ఉన్న టైటిల్ ని సెలెక్ట్ చేశారు. మరి బేసి సంఖ్య సెంటిమెంట్ అని అనుకోవాలేమో.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!