SSMB 30: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత నాలుగు సంవత్సరాల నుండి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు రీసెంట్ గా సర్కారు వారి పాటతో రికార్డు స్థాయి కలెక్షన్లు రావడం జరిగింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన కెరియర్ లో 28వ సినిమా చేస్తున్నారు. “SSMB 28” వర్కింగ్ టైటిల్ పేరిట త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరగబోయే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గతంలో అతడు, ఖలేజా వంటి రెండు డిఫరెంట్ సినిమాలు మహేష్ లో కొత్త నటన వెలికి తీసిన త్రివిక్రమ్.. మూడో సినిమాతో ఎటువంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారు అనేది అభిమానులలో ఉత్కంఠ భరితంగా ఉంది. ఇక త్రివిక్రమ్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. బహుబలి 2, “RRR” హిట్ తో మంచి జోరు మీద ఉన్న రాజమౌళి.. మహేష్ సినిమాతో మరోసారి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులు తారుమారు చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయ్.
ఈ సినిమాని దాదాపు ఎనిమిది వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇదంతా పక్కన పెడితే మహేష్ కెరీర్లోనే 30వ సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు అప్పుడే ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నయి. ఈ క్రమంలో మహేష్ బాబుని 30వ సినిమా కోసం ముగ్గురు డైరెక్టర్లు లైన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, సుకుమార్. ఈ ముగ్గురు మహేష్ బాబుతో చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్. ఇండస్ట్రీలో రాజమౌళి తో చేసిన హీరోల అందరికీ దాదాపు రవితేజ మినహా మిగతా హీరోలు అందరూ… వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నారు. మరి రాజమౌళితో సినిమా చేసిన తర్వాత మహేష్ ఎవరితో చేస్తారో చూడాలి.