సినిమా

Mahesh Babu-Namrata: న‌మ్ర‌త‌ను అందుకే పెళ్లి చేసుకున్నా.. ఓపెన్ అయిన మ‌హేష్‌!

Share

Mahesh Babu-Namrata: టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ లో మ‌హేష్ బాబు-న‌మ్ర‌త జంట ఒక‌టి అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. `వంశీ` సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఆ త‌ర్వాత పెద్ద‌ల అంగీకారంతో ఫిబ్రవరి 10న అతి కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో మ‌హేష్ బాబు, న‌మ్ర‌త పెళ్లి బంధంతో ఒక‌టి అయ్యారు.

ఇటీవ‌లె ఈ దంప‌తులు 17వ వెడ్డింగ్‌ యానివర్సరీని జ‌రుపుకుని అత్యంత అన్యోన్యమైన జంటగా ఎంద‌రికో అద‌ర్శంగా నిలిచారు. పెళ్లి త‌ర్వాత న‌ట‌కు గుడ్‌బై చెప్పేసిన న‌మ్ర‌త.. భార్యగా మ‌హేష్‌కు సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటూ ఉంటుంది. పైగా నమ్రతను పెళ్లి చేసుకున్న తర్వాతే హీరోగా మహేష్ బాబు కెరీర్ స్పీడ్ అందుకుంది.

ఇదిలా ఉంటే.. న‌మ్ర‌త‌ను పెళ్లి చేసుకోవ‌డంపై మ‌హేష్ ఓపెన్ కామెంట్స్‌ చేశారు. `స‌ర్కారు వారి ప్ర‌మోష‌న్స్‌` ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మ‌హేష్ బాబు ఇన్ స్టాగ్రామ్ లో ‘ఆస్క్ ఎనీథింగ్’ అంటూ చిట్ చాట్ సెష‌న్ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా నెటిజ‌న్లు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో స‌మాధానాలు ఇచ్చారు.

ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ నమ్రతలో మీకు బాగా నచ్చిన విషయం ఏమిటి ? అని ప్ర‌శ్నించాడు. అందుకు మ‌హేష్ బాబు..`నాకు నమ్రతలో అన్ని విషయాలు నచ్చాయి. అందుకే కదా ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను` అని మహేష్ చిన్న సిగ్గుతో నవ్వుతూ సమాధానం చెప్పారు. దీంతో ఆయ‌న కామెంట్స్ కాస్ల నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా, మ‌హేశ్ తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌` రేపు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది.


Share

Related posts

Sunitha: రామ్ వీరపనేని పిల్లలకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే ఆశ్చర్య పోతారు!!

Naina

ఇందులో నిజమెంత అంత సులభంగా నాగార్జున ఒప్పుకోడే ..?

GRK

కరోనా నుండి కోలుకున్న రాజశేఖర్..! ఆసుపత్రి నుండి డిశ్చార్జ్..!!

Special Bureau