Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకి స్టార్ డామ్ తీసుకొచ్చిన సినిమా “పోకిరి” పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2006వ సంవత్సరంలో విడుదలయ్యి ఇండస్ట్రీ హిట్ అయింది. అప్పటిదాకా ప్రిన్స్ అనే స్టార్ ట్యాగ్ ఉండగా.. “పోకిరి” తో సూపర్ స్టార్ గా మహేష్ పిలవబడటం స్టార్ట్ అయింది. ఈ సినిమాకి ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ “అతడు” అనే సినిమా చేయడం జరిగింది. “పోకిరి”తో మహేష్ కి ఒక్కసారిగా ఉన్న క్రేజ్ డబల్ అయ్యింది. కానీ “అతడు” సినిమా టయానికి సైలెంట్ క్రేజ్ ఉన్న హీరో. ఒకవేళ “పోకిరి” తర్వాత “అతడు” సినిమా వచ్చి ఉంటే వేరే లెవెల్ లో మహేష్ ఇమేజ్ ఉండేదని ఇప్పటికి చాలా మంది అంటారు.
2005వ సంవత్సరంలో వచ్చిన “అతడు” థియేటర్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన గాని ఇప్పటికీ టెలివిజన్ రంగంలో మాత్రం రికార్డు స్థాయి టిఆర్పి రేటింగ్స్ సాధిస్తూ ఉంటది. ఈ సినిమాలో మహేష్ బాబు మాట్లాడేది తక్కువ.. చేతలతో చూపించేది ఎక్కువ. చాలా ప్రొఫెషనల్ గా “అతడు” సినిమాని త్రివిక్రమ్ తెరకెక్కించాడు. మణిశర్మ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమా మొత్తానికి హైలైట్. జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై మురళీమోహన్ నిర్మించారు. అయితే ఇటీవల మురళీమోహన్ ఇంటర్వ్యూలో పాల్గొని “అతడు” సినిమా స్టోరీ మొదట ఉదయ్ కిరణ్ కి చెప్పటం జరిగింది.
అతన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా చేయాలని అంతా ఫిక్స్ అయ్యాం. ఉదయ్ కిరణ్ కూడా మీతో సినిమా చేయటం చాలా సంతోషమని అంగీకరించాడు. ఆ తరువాత చిరంజీవి కూతురితో పెళ్లి అంతా అనుకున్న టైంలో ఉదయ్ కిరణ్ డైరీ అల్లు అరవింద్ తీసుకొని సినిమా డేట్స్ మొత్తం సెట్ చేయాలని భావించిన క్రమంలో పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడం జరిగిందని అన్నారు. ఆ విధంగా ఉదయ్ కిరణ్… మహేష్ “అతడు” సినిమా మిస్ చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు.