సినిమా

Mahesh Babu: తెలుగు సినీ పరిశ్రమలో పక్కా ఫామిలీ మేన్ అంటే మహేష్ బాబునే.. ఎందుకో తెలుసా?

Share

Mahesh Babu: తెలుగు సినిమా పరిశ్రమలో పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అంటే ఎవరు? అనగానే ఎవరికన్నా ఒకరి పేరే తలంపులోకి వస్తుంది. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు. అవును.. ఈ ప్రిన్స్ వరుస సినిమాలు చేస్తూనే, తన కుటుంబానికి కావలసినంత సమయాన్ని ఇస్తారు. ఇతనికి తోడుగా భార్య నమ్రత కూడా అంతే విధేయురాలిగా ఉంటుంది. ఆమె మహేష్ ప్రతి అడుగులోనూ ఉంటుంది. సినిమా, బిజినెస్, పర్సనల్ లైఫ్ ఇలా అన్ని విధాలుగా తనకు అండగా నిలుస్తారు నమ్రత. అందుకే మహేష్ అటు సినిమా కెరీర్ ని, ఇటు పర్సనల్ లైఫ్ ని ఎవ్వరు ఎంజాయ్ చేయనంతగా ఎంజాయ్ చేస్తారు.

Mahesh Babu is the perfect family man in the Telugu film industry .. Do you know why?
Mahesh Babu is the perfect family man in the Telugu film industry .. Do you know why?

Mahesh Babu: వెకేషన్స్ వారి కోసమే మరి!

ఒక్కసారి సినిమా షూటింగ్ పూర్తయితే, మహేష్ తన కుటుంబ సభ్యులతో వెకేషన్స్ కి వెళుతూ ఉంటాడు. ప్రతిసారీ షూట్ ప్రారంభానికి ముందు ముగింపు తర్వాత ఫ్యామిలీ వెకేషన్లు ఉంటాయి. ఇప్పుడు సర్కార్ వారి పాట రిలీజ్ ముందే వెకేషన్ కి ప్లాన్ చేసేసాడు. ఎందుకంటే తదుపరి రాజమౌళి సినిమా వుంది కాబట్టి. ఎందుకంటే ఈ సినిమా ఒక్కసారి మొదలైతే ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేము కదా. అందుకనే ప్రిన్స్ ఈ సారి కొంచెం భారీగానే హాలిడేస్ ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకుముందు మహేష్ స్టోరి సిట్టింగ్ కోసం దుబాయ్ వెళ్లాడని కథనాలొచ్చాయి. ఇంతలోనే ఇప్పుడు కుటుంబంతో పారిస్ లో ప్రత్యక్షమయ్యాడు. సతీమణి నమ్రత -పిల్లలు గౌతమ్ & సితారలతో మహేష్ బాబు తాజాగా ఇక్కడ దిగిన ఓ ఫోటో నెట్టింటో ప్రత్యక్షం అయింది.

Mahesh Babu is the perfect family man in the Telugu film industry .. Do you know why?
Mahesh Babu is the perfect family man in the Telugu film industry .. Do you know why?

సర్కారు వారి సంగతి:

ఈ మే 12న విడుదలకు సిద్ధమవుతున్న సర్కారు వారి పాట ప్రమోషన్స్ ని ప్రారంభించే ముందు మహేష్ బాబు తన కుటుంబంతో బయటకు చెక్కేసాడు. అతను హైదరాబాద్ కి తిరిగి రాగానే ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయిపోతాడు. మే 2న సర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు పరశురామ్ ఆల్రెడీ ప్రకటించాడు. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు వున్నాయి. ఈ భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్ ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కీర్తి సురేష్ కథానాయిక. మహేష్ బాబు కూతురు సితార కూడా ఈ సినిమాలోని పెన్నీ పాటతో అరంగేట్రం చేయనుంది.


Share

Related posts

Tamannah : సినిమాలకంటే వెబ్ సిరీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన తమన్నా..!

GRK

Balakrishna : బాలకృష్ణ సినిమాలో వరలక్ష్మీ..!

GRK

Deva katta: పవన్ కళ్యాణ్‌తో ఫ్లాప్ సినిమా సీక్వెల్‌ ..అంత నమ్మకం ఏంటీ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar