సినిమా

మహేష్ బాబు తన జీవితంలో మరువలేని ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలుసా..?

Share

 

టాలీవుడ్ ప్రిన్స్ అనగానే మనందరికీ మొదటగా గుర్తుకొచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు తన అందం, నటన, దాతృత్వం లో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నారు. అంతే కాదు అతను ఎదుటి వాళ్లకి ఇచ్చే మర్యాద, గౌరవం చూసి సినీ ప్రేక్షకులు ఎప్పుడూ ఫిదా అవుతుంటారు. అతనితో ఒక్కసారి పరిచయమైతే జీవితాంతం ఫ్రెండ్షిప్ చేయకతప్పదని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చెబుతుంటాడు గా అంత మంచి వ్యక్తిత్వం మహేష్ సొంతం. సినిమాలోనే కాదు బయట కూడా ఇతడు శ్రీమంతుడే. ఎందరో జీవితాలలో మహేష్ వెలుగులు నింపాడు. అందుకే అతడికి మిస్టర్ పర్ఫెక్ట్ అనే బిరుదు కరెక్ట్ గా సరిపోతుంది. అయితే నిన్న ఆయన తన 47వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ గ్రాండ్‌గా అభిమానులు కేక్ కట్ చేసి, మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే అతని వ్యక్తిగత జీవితం గురించి తాజాగా ఒక విషయం బయటకు వచ్చింది.

వారిద్దరి అంటే బాగా ఇష్టం

ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ బాబుకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మహేష్ బాబు తన కుటుంబానికే మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. గతంలో ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ తన జీవితంలో ఇద్దరికీ ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటానని చెప్పారు. వారిలో మొదటిది ఆయన తల్లి ఇందిరా దేవి. ఆమె అంటే మహేష్ బాబుకు చాలా ఇష్టం. ఆ తరువాత మహేష్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్న అతని భార్య నమ్రత శిరోద్కర్ అంటే ఇష్టం. ఎన్నో జంటలకు మహేష్ బాబు, నమ్రత జంట ఆదర్శంగా నిలుస్తారు.

అలా మొదలైన వారి జర్నీ

వంశీ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంట్లో విషయం చెప్పగా రెండు కుటుంబాలు వారి పెళ్లికి నిరాకరించారు. కానీ మహేష్, నమ్రత వెనకడుగు వేయకుండా వారి స్టైల్ లో చెప్పి ఒప్పించి సింపుల్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు. ఇప్పుడు నమ్రత, మహేష్ మంచి పొజిషన్లలో ఉన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తన తల్లి చేత్తో అన్నం తినడం అంటే మహేష్ బాబుకి చాలా ఇష్టమట. మహేష్ బాబు తన సింప్లిసిటీతో అందరినీ ఆకట్టుకుంటాడు.

 


Share

Related posts

Bheemla Naayak: “బీమ్లా నాయక్”.. ప్రీ రిలీజ్ వేడుకలో మెగా సెంటిమెంట్ ఫాలో అవుతున్న సినిమా యూనిట్..!!

sekhar

బిగ్ బాస్ 4 : వామ్మో… రెండు ఎపిసోడ్ లకి సమంత ఇంత తీసుకుందా…?

arun kanna

Nagarjuna: ఇజ్రాయేల్ దేశం పై మనసు పారేసుకున్న నాగార్జున..!!

sekhar