SSMB 28: ఇండస్ట్రీలో ప్రస్తుతం మహేష్ బాబు టైం గట్టిగా నడుస్తోంది. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ విజయాలు.. మనోడు ఖాతాలో పడ్డాయి. గత నాలుగు సంవత్సరాల నుండి తిరుగులేని కెరియర్ తో మహేష్ బాబు దూసుకుపోతున్నరు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, రీసెంట్ గా సర్కారు వారి పాట తో వరుస విజయాలు సాధిస్తూ మహేష్ మంచి జోరుమీదున్నాడు. ఇక ఇదే సమయంలో సినిమా సినిమాకి కూడా మేకోవర్ మార్చే తీశాక మహేష్ ప్లానింగ్ చేస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
“సర్కారు వారి పాట” సినిమా రాకముందు మహేష్ గెటప్ దాదాపు అన్నిటిలో ఒకేలాగా కనిపించడం జరిగింది. ఆ తర్వాత “సర్కారు వారి పాట” సినిమాకి వచ్చేసరికి జుట్టు పెంచడంతోపాటు మెడపై టాటో.. చెవికి పోగుతో మహేష్ సరికొత్త లుక్ లో అభిమానులను అలరించడం జరిగింది. అయితే ఇప్పుడు తర్వాత చేయబోయే త్రివిక్రమ్ ప్రాజెక్టుకు మరో కొత్త లుక్ తో… మహేష్ రెడీ అవుతున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. పూర్తి విషయంలోకి వెళ్తే… త్రివిక్రమ్ సినిమాలో మహేష్ రఫ్ లుక్ లో పూర్తి గెడ్డంతో… కనిపించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మహేష్ యూరప్ ట్రిప్ లో కుటుంబంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రిప్ కి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అన్ని ఫోటోలులో కూడా మహేష్ రఫ్ లుక్ లో గెడ్డంతో… కనిపిస్తున్నారు. సో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయబోయే మూడో సినిమాల్లో.. మహేష్ క్యారెక్టర్ పవర్ ఫుల్ అని అందుకే మహేష్ గెడ్డం పెంచినట్లు ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 31 వ తారీకు కృష్ణ బర్త్ డే సందర్భంగా.. త్రివిక్రమ్ సినిమా టైటిల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతమాత్రమే కాదు కుదిరితే రాజమౌళి తో మహేష్ చేయబోయే సినిమా అప్ డేట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.