SSMB 30: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల “సర్కారు వారి పాట”తో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం తెలిసిందే. అంతకుముందే మూడు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని హ్యాట్రిక్ సాధించిన మహేష్.. “సర్కారు వారి పాట” తో మరో హ్యాట్రిక్ కి నాంది పలికారు. ప్రస్తుతం త్రివిక్రం అదేవిధంగా రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఆల్ రెడీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కి సంబంధించి పూజా కార్యక్రమాలు స్టార్ట్ కావడం తెలిసిందే. జులై నెలలో ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. మహేష్ కెరీర్లో ఇది 28వ సినిమా. ఆ తర్వాత రాజమౌళి తో తన కెరీర్లో 29వ సినిమా చేస్తున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ నేపథ్యంలో తన 30వ సినిమా విషయంలో మహేష్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఫాలో అయ్యే రీతిలో ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. మేటర్ లోకి వెళ్తే ఎన్టీఆర్ “RRR” తరువాత తన కెరియర్ లో 30 వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళితో సినిమా చేసిన తరువాత ఎన్టీఆర్ గతంలో అనేక పరాజయాలు ఎదుర్కోవటం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అటువంటి పరిస్థితి రాకుండా.. కొరటాల శివతో వర్క్ చేస్తూ ఉన్నారు. హిట్ ట్రాక్ ప్రకారం కొరటాలకి ఒక “ఆచార్య” మినహా.. అంతకుముందు చేసిన సినిమాలు అని విజయం సాధించాయి.
ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళి మాదిరిగా హీరోని చూపించగలిగే సత్తా… కొరటాలలో ఉంది అని చాలామంది అంటారు. ఆ నమ్మకంతోనే తారక్ ఇప్పుడు సినిమా చేస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇదే ఫార్ములా మహేష్ తన కెరీర్లో 30వ సినిమా కొరటాలతో ప్లాన్ చేసినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది. 29వ సినిమా రాజమౌళితో.. చేస్తున్న నేపథ్యంలో తర్వాత ఫ్లాప్ రాకుండా ఎన్టీఆర్ మాదిరిగానే.. మహేష్ కూడా తన 30వ సినిమా కొరటాలతో చేయటానికి రెడీ అయినట్లు ఫిలిం నగర్ టాక్. కొరటాల దర్శకత్వంలో గతంలోనే మహేష్ నటించిన భరత్ అనే నేను, శ్రీమంతుడు రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. ఆ నమ్మకంతో తన కెరియర్ లో 30 రోజు సినిమా బాధ్యతను మహేష్ కూడా డైరెక్టర్ కొరటాల శివ చేతిలో పెట్టినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!