Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని సూపర్ స్టార్ గా మహేష్ బాబు సరికొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటూ వరుస విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రికి తగ్గ తనయుడిగా మాత్రమే కాకుండా అంతకు మించి అన్న రీతిలో కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని విజయాలు సాధిస్తూ ఉన్నారు. ఇటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లో అనేక విజయాలు సాధించినా కానీ ఆయన చేతి దాక వచ్చి వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు లిస్ట్ చాలానే ఉంది. ముందుగా అప్పట్లో సూర్య కెరీర్ లో బ్లాక్ బస్టర్ అయిన “గజిని” సినిమా స్టోరీ మహేష్ దగ్గరికి రావడం జరిగిందట. అదే రీతిలో రవితేజ నటించిన “ఇడియట్” సినిమా స్టోరీ కూడా మహేష్ బాబు దాక రావటం ఆయన రిజెక్ట్ చేయడం జరిగిందట.
ఇదే లిస్ట్ లో స్నేహితుడు, 24 సినిమాలు కూడా మహేష్ వదులుకున్నారని టాక్. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు ఫిదా, లీడర్ సినిమాల స్టోరీ ముందుగా మహేష్ దగ్గరకు వచ్చినట్లు ఆయన కాదనటంతో వాటిని ఇతరులు టేకప్ చేసి విజయాలు సాధించడం జరిగిందట. అంతమాత్రమే కాకుండా దివంగత ఉదయ్ కిరణ్ నటించిన “మనసంతా నువ్వే” సినిమా స్టొరీ మొదటిలో మహేష్ దగ్గరికి వచ్చినట్లు ఆయన కాదనటంతో ఉదయ్ కిరణ్ నటించి బ్లాక్ బస్టర్ అందుకోవడం జరిగిందట. ప్రభాస్ కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ సినిమా వర్షం స్టోరీ మొదటిలో మహేష్ దగ్గరికి వచ్చినట్లు ఆయన రిజక్ట్ చేయడంతో ప్రభాస్ అందుకునే సూపర్ డూపర్ హిట్ కొట్టాడట.
Read More: Mahesh Babu: మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమా గురించి సంచలన విషయం బయటపెట్టిన థమన్..!!
“రుద్రమదేవి” సినిమాలో అల్లు అర్జున్ నటించిన గోనగన్నారెడ్డి క్యారెక్టర్ కూడా మహేష్ చేయాల్సి ఉండగా అది ఆయన రిజక్ట్ చేయడంతో గుణశేఖర్ బన్నీ చేత చేయించడం జరిగింది అని ఫిలిం నగర్ టాక్. ముఖ్యంగా నాగ చైతన్య కి మొట్టమొదటి సూపర్ డూపర్ హిట్ సినిమా ఏ మాయ చేసావే స్టొరీ కూడా మహేష్ దాక వచ్చినట్లు ఆయన రిజెక్ట్ చేయడంతో .. చైతూకి అదృష్టం అందుకొని విజయం సాధించడం జరిగిందట. ఏది ఏమైనా దాదాపు పదికి పైగా బ్లాక్ బస్టర్ సినిమాలు మహేష్ వదులుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో .. లిస్టు చూసి ఇవన్నీ చేసి ఉంటే మహేష్ రేంజ్ మరోలా ఉండేదని అభిమానులు తాజాగా డిస్కషన్లు చేసుకుంటున్నారు.