Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు పలు బ్రాండ్స్‌కి ప్రచార కర్తగా వ్యవహరిస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు. అసలు మహేష్ బాబు చేస్తునన్ని వాణిజ్య ప్రకటనలు మరే స్టార్ హీరో చేయడం లేదు. అందుకే సౌత్ ఇండస్ట్రీలో పర్ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే మహేష్ బాబు పేరే ముందు వినిపిస్తుంది.
అయితే ఈయన చేతికి మరో బ్రాండ్ వచ్చి చేరింది. అదే మౌంటెన్ డ్యూ. మొన్నటి వరకూ ఈ కూల్ డ్రింక్ కు అక్కినేని అఖిల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. కానీ, ఇప్పుడు ఆయన ప్లేస్‌ను మహేష్ రీప్లేస్ చేశాడు. ఇక తాజాగా మేకర్స్ మౌంటెన్ డ్యూ కోసం భారీ యాడ్‌ని డిజైన్ చేయగా.. అందులో మహేష్ అదరగొట్టేశాడని చెప్పాలి.
ఈ యాడ్‌లో దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా టవర్ వంటి ఎత్తైన కట్టడం నుంచి బైక్ డ్రైవ్ చేసుకుంటూ కిందకు వచ్చే యాక్షన్ స్టంట్ లో మహేష్ బాబు కనిపిస్తాడు. చాలా భారీగా తెరకెక్కిన ఈ యాడ్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇకపోతే మౌంటెన్ డ్యూ యాడ్‌కి మహేష్ పుచ్చుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఎందుకంటే, ఈ కొత్త యాడ్కిగానూ మహేష్ బాబు ఏకంగా రూ. 12 కోట్లను రెమ్యునరేషన్‌గా పుచ్చుకున్నాడట. ఏదేమైనా ఒక్క యాడ్కే అంత పరితోషకమంటే ఎవ్వరికైనా మతిపోద్ది. ఇక మహేష్ సంవత్సరం పాటు మౌంటెన్ డ్యూ ను ప్రచారం చేయాల్సి ఉంటుంది.అందుకోసం మహేష్ బాబు ఫోటోలు మరియు వీడియోలను కూడా వాళ్ళు ఉపయోగించుకుంటారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!