సినిమా

Mahesh Babu: `స‌ర్కారు వారి పాట‌`కు మ‌హేష్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

Share

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తాజా చిత్ర‌మే `స‌ర్కారు వారి పాట‌`. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. స‌ముద్ర‌ఖ‌ని, వెన్నెల కిశోర్‌, న‌దియా, తనికెళ్ల భరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

కొద్ది రోజుల క్రిత‌మే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. దాదాపు రెండేళ్ల త‌ర్వాత మ‌హేష్ బాబు నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో స‌ర్కారు వారి పాట‌పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి ఆ అంచ‌నాల‌ను ఈ మూవీ ఏ మేర‌కు రీచ్ అవుతుందో మ‌రి గంట‌ల్లో తేలిపోనుంది.

ఇదిలా ఉంటే.. ఈ మూవీకి మ‌హేష్ బాబు తీసుకున్న రెమ్యున‌రేష‌న్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. స‌ర్కారు వారి పాట‌కు మ‌హేష్ బాబు రూ. 35 కోట్ల రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ అందుకున్నార‌ట‌. అలాగే ప్రాఫిట్‌లో కొంత షేర్ కూడా ఆయ‌న తీస‌కుంటున్నార‌ని అంటున్నారు.

అలాగే ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ఈ సినిమా రూ. 10 కోట్లు పారితోష‌కంగా అందుకుంటున్నార‌ట‌. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో ఆయ‌న‌కే తెలియాలి. కాగా, భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రంపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఈ మూవీ కోసం మ‌హేష్ బాబు అభిమానులే కాదు సాధార‌ణ సినీ ప్రియులు సైతం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

 


Share

Related posts

శ్రుతి.. మెడ‌లో పూల‌దండ‌

Siva Prasad

Vijay Thalapathy: `విజయ్ 66` స్టోరీ లీక్‌.. ఎన్టీఆర్ మూవీనే రిపీట్ చేస్తున్నారా?

kavya N

Kalpika Ganesh Cute Looks

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar