Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవలె `సర్కారు వారి పాట`తో ప్రేక్షకులను పలకరించి.. మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ అనంతరం మహేశ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఈ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అవ్వగా.. నందమూరి తారకరత్న విలన్‌గా కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం.. మరికొద్ది రోజుల్లోనే `ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28` వర్కింట్ టైటిల్‌తో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే తాజాగా ఈ మూవీకి మహేశ్ అందుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది.
`సర్కారు వారి పాట`కు రూ. 50 కోట్ల వరకు అందుకున్న మహేశ్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు మరింత పెంచేశాడట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. `ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28`కు గానూ రూ. 60 కోట్ల వరకు రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడట. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ రూ. 50 కోట్ల వరకు డిమాండ్ చేశాడని.. వీరి రెమ్యునరేషన్స్‌తో సహా సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు అని టాక్ నడుస్తోంది.
మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో వాళ్లకే తెలియాలి. కాగా, త్రివిక్రమ్-మహేశ్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన అతడు, ఖలేజా చిత్రాలు బాగానే అలరించడంతో.. వీరి తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ మూవీతో మహేశ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…