Trivikram Mahesh: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా ప్రేక్షకులను ఎంతగానో అలరించటం తెలిసిందే. రెండు సినిమాలలో కూడా మహేష్ నీ చాలా డిఫరెంట్ గా స్క్రీన్ మీద త్రివిక్రమ్ ప్రజెంట్ చేశాడు. అతడు లో పక్కా ప్రొఫెషనల్ కిల్లర్ గా.. మాటల తక్కువ యాక్షన్ ఎక్కువ.. హీరోయిజాన్ని ఎలివేట్ చేయగా.. “ఖలేజా” లో అతడికి వ్యతిరేకంగా మహేష్ లో ఉన్న ఫన్ యాంగిల్ త్రివిక్రమ్ బయట పెట్టాడు. ఖలేజా విడుదల అవ్వక ముందు వరకు మహేష్ బాబుకి కామెడీ రాదని బయట టాప్ ఉండేది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కానీ “ఖలేజా” మొదలుకొని మహేష్ బాబు.. తనదైన శైలిలో కామెడీ పండిస్తూ వరుసబెట్టి… విజయాలు అందుకొన్నాడు. పంచు డైలాగులు… సైలెంట్ సెటైర్ లు మహేష్ తనదైన శైలిలో స్క్రీన్ మీద చెలరేగి పోతూ ప్రజెంట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే 2010వ సంవత్సరంలో… కలేజా విడుదలయ్యింది. ఆ తరువాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ కాలేదు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తుండటంతో… అభిమానులు ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. జూన్ నెలాఖరు నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు ఇటీవల మహేష్ క్లారిటీ ఇచ్చారు.
అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి పండుగకు ఈ సినిమా రిలీజ్ చేయాలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మహేష్ డెడ్లైన్ పెట్టడం జరిగింది అని టాక్. విషయంలోకి వెళితే త్రివిక్రమ్ తర్వాత రాజమౌళి సినిమా జనవరి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో… ఒక్కసారి రాజమౌళి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే చాలా టైం పట్టే అవకాశం ఉండటంతో దాని కంటే ముందుగానే సినిమా కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ కి మహేష్ సూచన చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!