SSMB 28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమా “SSMB 28”. గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే సమయంలో మహేష్ తల్లి ఇందిరాదేవి మరణించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఇక రెండో షెడ్యూల్ స్టార్ట్ చేసే టైంలో తండ్రి కృష్ణ మరణించారు. దీంతో మహేష్ ఒక్కసారిగా ఎంతో నిరుత్సాహానికి గురయ్యాడు. ఆ తర్వాత జనవరి నెలలో సంక్రాంతి పండుగ తర్వాత సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది.
అప్పటినుండి ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటూ ఉంది. మధ్యలో మహేష్ విదేశాలకు వెళ్లి రాగా మళ్లీ ఇప్పుడు.. హైదరాబాదులో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో అనుకోకుండా ఒక్కసారిగా “SSMB 28” విడుదల తేదీ ప్రకటించడం జరిగింది. వచ్చే ఏడాది జనవరి 13వ తారీకు విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం మీద చూసుకుంటే వచ్చే సంక్రాంతికి.. టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో మహేష్ సినిమా సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాదిలో మహేష్ నుండి ఏ సినిమా రాదని అర్థమవుతుంది. విడుదల తేదీకి సంబంధించి అధికారిక పోస్టర్ మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది.
ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సంయుక్త మీనన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ గతంలో నటించిన అతడు, ఖలేజా రెండు కూడా ఫ్యాన్స్ నీ ఎంతగానో ఆకట్టుకున్న సినిమాలు. ఈ క్రమంలో వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే రాజమౌళి ప్రాజెక్టు మహేష్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!