సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి మూవీతో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతునున్న ఈ సినిమాలో మహేష్ మూడు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై స్కై రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటుంటేనే మరో పక్క డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీని ఏప్రిల్ 25న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని తరువాత మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి టాలీవుడ్ సర్కీల్‌లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని ముందుగా అనుకున్నట్టుగా సుకుమార్‌తో కాకుండా మరో దర్శకుడితో చేయబోతున్నాడని తెలుస్తోంది.
సుకుమార్ చెప్పిన కథలో మహేష్‌కు నచ్చకపోవడంతో, మరో కథని సిద్దం చేయడానికి లెక్కల మాస్టర్ ఆరు నెలల టైం అడిగాడట. సో ఎంత తక్కువ సమయం వేసుకున్నా కూడా సుకుమార్ బౌండెండ్ స్క్రిప్ట్ రెడీ చేయడానికి చాలా టైం తీసుకుంటాడు. అందుకే సుకుమార్ కథ సిద్ధం చేసే లోపు వరుస చిత్రాలతో మంచి దూకుడు మీదున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నెక్ప్ట్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇటివలే ప్రిన్స్‌ని కలిసి స్టోరీ వినిపించాడట అనిల్ రావిపూడి. కథలో కామెడి, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో పాటు క్యారెక్టరైజేషన్‌కు కానెక్ట్ అయిన మహేష్, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ టాలీవుడ్ సర్కీల్‌లో వినిపిస్తోంది. దిల్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ మే నుండి సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఆల్ రెడీ వాట్సాప్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!