Jayamma Panchayathi: టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరోలు పవన్, మహేష్. ఈ ఇద్దరు హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో ఉంటాయి. ఏ మాత్రం బొమ్మ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది అంటే.. సదరు సినిమా నిర్మాతకి కాసుల వర్షం కురవటం గ్యారెంటీ. ఇద్దరికిద్దరు డిఫరెంట్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో.. బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలతో సంచలనాలు క్రియేట్ చేస్తారు. ప్రస్తుతం బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు… మల్టీస్టారర్ సినిమాలు ఎన్నో తెరకెక్కుతున్నాయి. అయితే పవన్, మహేష్ కాంబినేషన్ లో మల్టీస్టారర్.. వస్తే చూడాలని చాలా మంది యొక్క కోరిక. ఇదంతా పక్కన పెడితే తెలుగు టెలివిజన్ రంగంలో సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న యాంకర్ సుమ అని అందరికీ తెలుసు.
ఎంతటి పెద్ద సినిమా ఫంక్షన్ అయినా ఎంత పెద్ద హీరో అయినా… చాలా అలవోకగా యాంకరింగ్ చేస్తూ కామెడీ పండిస్తూ… ప్రీ రిలీజ్ వేడుకలు సక్సెస్ అయ్యేలా.. డీల్ చేస్తూ ఉంటది. షోస్ కూడా ఈ తరహాలోనే సక్సెస్ అయ్యే విధంగా రాణిస్తది. అటువంటి సుమ ప్రధాన పాత్రలో నటించిన “జయమ్మ పంచాయతీ” సినిమా ఈనెల ఆరవ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ముఖ్య అతిథులుగా అక్కినేని నాగార్జున, నాచురల్ స్టార్ నాని హాజరయ్యారు.
విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కి కీరవాణి సంగీతం అందించారు. అయితే రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలో 2 వారాల క్రితం పవన్ కళ్యాణ్ చేత ట్రైలర్ విడుదల చేయించారు. ఇప్పుడు “జయమ్మ పంచాయతీ”కి సంబంధించి సెకండ్ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేత రిలీజ్ చేయించటానికి సినిమా యూనిట్ రెడీ అయింది. మే నాలుగోవ తారీకు ఉదయం 11 గంటలకు మహేష్ బాబు “జయమ్మ పంచాయతీ” సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇండస్ట్రీలో టాప్ హీరోలు పవన్, మహేష్ ల చేత ట్రైలర్ రిలీజ్ నేపథ్యంలో “జయమ్మ పంచాయతీ” పై సినిమా ప్రేమికులకు ఫోకస్ మరింత పెరిగింది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!