Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన ‘సర్కారు వారి పాట’ సినిమా త్వరలో రిలీజు కాబోతున్న విషయం తెలిసినదే. ఈ సినిమా విడుదలకు మరో 9రోజులు మాత్రమే మిగిలి ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి నుంచి కళావతి అనే సాంగ్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి కూడా అందరికీ తెలుసు. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు ఈ సినిమా యూట్యూబ్‌లో 150 మిలియన్ పైగా వ్యూస్ రాబట్టి దూసుకుపోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Mahesh Babu: సర్కారు వారి రికార్డులు
థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలు దుమ్ముదులుపుతున్నాయి. ఇక ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి విడుదల చేసిన రెండో పెన్నీ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ పాట ఇప్పటికే 29 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతోంది. ఈ క్రమంలో విడుదలైన టైటిల్ సాంగ్ కూడా 10 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఈ సినిమాకు ఇంకా 9 రోజులు మాత్రమే మిగిలి ఉండటంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మురం చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ట్రైలర్ సంగతి
జస్ట్ నిన్నే విడుదలైన ఈ ట్రైలర్ ఇప్పటి వరకు 25 మిలియన్ వ్యూస్‌కు పైగా రాబట్టి సునామి సృష్టిస్తోంది. అంతేకాకుండా 1.1 మిలియన్ లైక్స్ సంపాదించి, అరుదైన రికార్డు నెలకొల్పింది. ఈ ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. మరోసారి మహేష్ బాబు బాక్సాఫీస్ దగ్గర మాయ చేయడం పక్కా అని చెబుతున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు చెప్పిన డైలాగులు అదిరిపోయాయి. “నా ప్రేమను దొంగలించగలవు. నా స్నేహాన్ని దొంగలించగలవు కానీ నా డబ్బులు దొంగలించ లేవు!” అన్న మహేష్ బాబు డైలాగు డైనమైట్ లాగా పేలింది. ‘ఓ వంద వయాగ్రాలు వేసి శోభనం కోసం వెయిట్ చేస్తోన్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు!’ అనే డైలాగ్ అయితే మాస్ లో ఒక ఊపు ఊపుతోంది.