సినిమా

Mahesh Babu: ఖలేజా ఉన్న మ‌హేష్ బాబే వ‌ణికిపోయిన సంఘ‌ట‌న‌..దాన్ని చూసి 4 కిలోమీట‌ర్లు ప‌రుగే ప‌రుగు!

Share

Mahesh Babu: సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌యుడిగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ప్రిన్స్ మ‌హేష్ బాబు.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్నాడు. ప్ర‌స్తుతం ఉన్న టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒక‌రైన మ‌హేష్‌.. ఇప్ప‌టికే ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించి త‌న ఖ‌లేజా ఏంటో రుచి చూపించాడు. అయితే అటువంటి వ్య‌క్తే వ‌ణికిపోయిన ఓ సంఘ‌ట‌న తాజాగా బ‌య‌ట‌కొచ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

గ‌తంలో ఒక‌సారి మ‌హేష్ బాబు కేబీఆర్ పార్కులో జాగింగ్ కోసం వెళ్లార‌ట‌. అయితే పార్కు మొత్తం ఒక రౌండేస్తుండ‌గా.. ఓ చోటు పెద్ద పాము ప‌డ‌గ విప్పి క‌నిపించింద‌ట‌. దాన్ని చూడ‌గానే భ‌య‌ప‌డిపోయిన మ‌హేష్‌.. ఏం ఆలోచించ‌కుండా దెబ్బ‌కు తాను వ‌చ్చిన దారిలోనే వెన‌క్కి నాలుగు కిలోమీట‌ర్లు ఆప‌కుండా ప‌రుగు పెట్టార‌ట‌. అంతే కాదు, ఈ సంఘ‌ట‌న త‌ర్వాత మ‌ళ్లీ జీవితంలో ఆయ‌న కేబీఆర్ పార్కు ముఖం చూడ‌లేద‌ట‌.

Mahesh Babu was feared to see that
Mahesh Babu was feared to see that

ఈ పాము క‌థ‌ను మ‌హేష్ బాబు.. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న `అన్ స్టాపబుల్ విన్ ఎన్‌బీకే` షోలో రివిల్ చేశాడు. దీంతో ఇప్పుడిది కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, మ‌హేష్ బాబు సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కావాల్సి ఉన్నా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది.

ప్ర‌స్తుతం శ‌ర వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 1న రిలీజ్ కాబోతోంది. ఇక ఈ చిత్రం విడుద‌ల అనంత‌రం మ‌హేష్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో ఓ సినిమా, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్స్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది.


Share

Related posts

Raveena Daha Recent Gallerys

Gallery Desk

బిగ్ బాస్ 4 : నిన్నటి గొడవ తర్వాత ఈ కంటెస్టెంట్ కి ఒక్క రోజులో రికార్డు స్థాయి ఓట్లు వేసేశారుగా….

arun kanna

Alia Bhatt: అలియా భట్ ని ఆకాశానికెత్తేసిన బిగ్ బి.. ఆ సినిమాలో ఆమె నటన అద్భుతమట!

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar