Mahesh Rajamouli: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఫుల్ మాస్ పాత్రలో మహేష్ బాబు కనిపిస్తున్నారు. పైగా చాలా సంవత్సరాల తర్వాత మహేష్ ఈ సినిమాలో స్మోకింగ్ చేస్తూ కనిపించడంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో మహేష్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
RRR తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మహేష్ సినిమాపై దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. RRR తో జక్కన్న ఇంటర్నేషనల్ లెవెల్ లో తనకంటూ స్టాండర్డ్ ఏర్పరచుకున్నాడు. దీంతో మహేష్ సినిమాని ప్రపంచ స్థాయిలో తీయబోతున్నారు. అదేవిధంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ఇండియాలో ఉన్న ప్రథమ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన భాషలలో మహేష్ సినిమా విడుదలయ్యేలా జక్కన్న అదిరిపోయే ప్లాన్ వేయడం జరిగిందట. ఇదిలా ఉంటే రాజమౌళితో చేయబోయే ప్రాజెక్టు కోసం మహేష్ ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచేయటం జరిగిందట. మేటర్ లోకి వెళ్తే ఏకంగా 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం “గుంటూరు కారం” సినిమాకి 70 కోట్లకు పైగా మహేష్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.
అయితే జక్కన్న ప్రాజెక్ట్ చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా రెమ్యూనరేషన్ అధికంగా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో రాజమౌళి సినిమా మహేష్ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ నీ రాజమౌళి రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందట. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పనులన్నీ పూర్తయినట్లు ఇటీవల మహేష్ బాబు కి స్టోరీ మొత్తం వినిపించినట్లు.. ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇక హీరోయిన్ విషయానికొస్తే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆమె నటించబోతున్నట్లు సమాచారం.