Mahesh babu: ఈ విషయంలో కాంప్రమైజ్ కాని మహేశ్..అందుకే బ్లాక్ బస్టర్స్ మిస్ అవుతున్నాడు..

Share

Mahesh babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు కథల ఎంపికలో తండ్రి సూపర్ స్టార్ కృష్ణను ఫాలో అవుతాడనే టాక్ ఉండేది. అయితే రాను రాను అది మారిందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపించింది. అందుకు కారణం మహేశ్ సక్సెస్‌లలో లేని దర్శకులను అసలు దగ్గరకు రానివ్వడనే కామెంట్స్ రావడమే. గత కొంత కాలంగా మహేశ్ ఎంచుకుంటున్న దర్శకులను చూస్తే అదే అర్థమవుతోంది. కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, పరశురాం లాంటి వారికే మహేశ్ బాబు అవకాశాలు ఇచ్చాడు. వీరందరూ సక్సెస్‌లలో ఉన్న దర్శకులే.

mahesh-babu-will not compromise in that matter
mahesh-babu-will not compromise in that matter

ఇక సుకుమార్ మహేశ్ బాబుతో 1 నేనొక్కడినే సినిమాను చేశాడు. ఈ సినిమా టెక్నికల్‌గా మంచి ప్రశంసలు అందుకున్నా.. కన్‌ఫ్యూజన్ ఎక్కువ ఉండటంతో ఫ్లాప్ సినిమాగా మిగిలింది. దాంతో మళ్ళీ సుకుమార్‌కు మహేశ్ అవకాశం ఇవ్వలేదు. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేశ్ పోకిరి, బిజినెస్ మేన్ చిత్రాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ముఖ్యంగా పోకిరి సినిమా 75 ఏళ్ళ రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టింది. బిజినెస్ మేన్ కూడా మంచి కమర్షియల్ హిట్ సాధించింది. అయినా హ్యాట్రిక్ సినిమా కోసం మహేశ్ పూరికి ఛాన్స్ ఇవ్వలేదు. అందుకు కారణం పూరి ఫ్లాపుల్లో ఉండటమే.

Mahesh babu: ఈ విషయంలో మహేశ్‌కు ఉండే లెక్కలు వేరేలా ఉన్నాయి.

ఇక పుష్ప సినిమా కథ కూడా మహేశ్ బాబు చేయాల్సిందట. కానీ, ఆ కథ మీద మహేశ్ నమ్మకం పెట్టుకోలేకపోయాడు. దాంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి భారీ హిట్ అందుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్‌గా క్రేజ్ సాధించాడు. ఇలాంటి కథను మరొకటి మహేశ్ వదులుకున్నాడు. అదే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్‌తో చేయబోతున్న స్పిరిట్. ఈ కథను మహేశ్ బాబుకు సందీప్ రెడ్డి వంగా ఎప్పుడో చెప్పాడు. కానీ, మహేశ్‌కు ఆ కథ నచ్చలేదు. ఇప్పుడు ఇదే కథకు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కేవలం సక్సెస్‌లో లేని దర్శకుడనే కారణంతో మహేశ్ కొన్ని మంచి ప్రాజెక్ట్స్ వదులుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయంలో మహేశ్‌కు ఉండే లెక్కలు వేరేలా ఉన్నాయి.


Share

Related posts

ఫోటో వైరల్: పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్..!!

sekhar

Radhe shyam : రాధేశ్యామ్ నుంచి నాలుగు నెలలు వరుసగా సర్‌ప్రైజెస్ ప్లాన్ చేసిన ప్రభాస్ ఇది కదా ఫ్యాన్స్ కావాలనుకుంది

GRK

రిషభ్ పంత్ సెంచరీ

Siva Prasad