దేశ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించటం తెలిసిందే. “బాహుబలి” తో సినీ ప్రపంచ దృష్టిని తనవైపు ఆకర్షించిన రాజమౌళి “RRR” తో మరోసారి సత్తా చాటాడు. ఏకంగా ఈ సినిమా చూసి హాలీవుడ్ దర్శకులు టెక్నీషియన్స్ రాజమౌళిని పొగడ్తలతో మాత్రమే కాదు ఇద్దరు హీరోలు చరణ్, తారక్ నటనాలపై కూడా ప్రశంసాలు వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే నెక్స్ట్ రాజమౌళి…మహేష్ బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పనులలో రాజమౌళి తలమునకలయ్యారు.
వచ్చే ఏడాది ప్రారంభం నుండి ఈ సినిమా షూటింగ్ జరగనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు “RRR” సినిమా చేస్తున్న టైంలో తారక్ భారీ వర్కౌట్ చేయడం తెలిసిందే. గిరిజన ప్రాంతానికి చెందిన నాయకుడిగా కొమరం భీం పాత్ర కోసం తన బాడీ షేప్ మార్చుకోవడానికి చాలా నెలలు టైం జిమ్ లో వర్క్ ఔట్స్ చేశాడు. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ కి లాయోడ్ స్టీవెన్ అనే ఫేమస్ జిమ్ ట్రైనర్ తారక్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా లాయోడ్ స్టీవెన్ ఇప్పుడు మహేష్ బాబు కి ట్రైనర్ గా పనిచేయడానికి రెడీ అయ్యారు. త్వరలో మహేష్.. రాజమౌళితో సినిమా చేయటానికి రెడీ అవుతున్న సమయంలో “RRR” లో ఎన్టీఆర్ కి ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనర్ తో మహేష్ ఇప్పుడు వర్క్ అవుట్ చేయడానికి చేతులు కలపటం సంచలనం రేపింది.
లాయోడ్ స్టీవెన్.. ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే కాదు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కి కూడా పర్సనల్ జిమ్ ట్రైనర్. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే రాజమౌళి సినిమా స్టార్ట్ మహేష్ స్టార్ట్ చేయనున్నారు. “బాహుబలి 2”, “RRR”ల కంటే మహేష్ సినిమా అతిపెద్ద భారీ బడ్జెట్ చిత్రంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.
Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!