సినిమా

SVP: ఫస్ట్ టైం అభిమానులకు లెటర్ రాసిన మహేష్ బాబు..!!

Share

SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా “సర్కారు వారి పాట” మే 12వ తారీకు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈవెంట్ జరిగే ప్రాంగణం అభిమానులతో నిండిపోయింది. ఇటువంటి తరుణంలో అభిమానులకు ఫస్ట్ టైం మహేష్ బాబు సినిమాకి సంబంధించి లెటర్ రాయడం జరిగింది.

Mahesh Babu writes a letter to first time fans

“ప్రియమైన అభిమాన మిత్రులకు, ప్రముఖ యువ దర్శకుడు ‘పరశురామ్’ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జి.యమ్. బి. ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ వంటి ప్రముఖ సంస్థలపై, ఎర్నేని నవీన్, యలమంచిలి రవి శంకర్, ఆచంట రామ్, ఆచంట గోపిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తయి, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో ‘సరేగమ’ కంపెనీ ద్వారా మార్కెట్ లో విడుదలై, రేటింగ్ లో విశేష సంచలనం సృష్టిస్తోంది. ఎన్నో అంచనాలతో, ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మన “సర్కారు వారి పాట” చిత్రం థియేటర్ల లోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు.

మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో, హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై యస్. రాధా కృష్ణ (చిన్న బాబు) నిర్మించే చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ లో మొదలు కాగలదు. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాన్ని ఆశించే….మహేష్ బాబు” అంటూ లెటర్ రాశారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మహేష్ సినిమా రిలీజ్ నేపథ్యంలో.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ టైం మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి తమన్ అందించిన పాటలు ఇప్పటికే అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరోపక్క మహేష్ “సర్కారు వారి పాట” తన కెరియర్ లో “పోకిరి” వంటి సినిమా అవుతుందని చెప్పటంతో… సినిమా చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఉన్నారు.


Share

Related posts

The Kashmir Files: మేజిక్ చేస్తోన్న ‘ది కశ్మీర్ ఫైల్స్’.. రోజురోజుకీ పెరిగిపోతున్న కలెక్షన్స్!

Ram

Mahesh Babu: పుట్టినరోజు కు ముందే అభిమానులకు సరికొత్త ట్రీట్ ఇవ్వబోతున్న మహేష్..!!

sekhar

Bigg boss Lasya : బిగ్ బాస్ లాస్య ఇల్లు చూస్తే వావ్ అనాల్సిందే?

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar