సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి సినిమాకి సరికొత్త మేకోవార్ తో ఇప్పటిదాకా కనిపించడం జరిగింది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన “సర్కారు వారి పాట” కోసం చెవికి పోగుతో పాటు.. గుబురు జుట్టు పెంచుకుని అంతకు ముందు సినిమాల కంటే మరింత గ్లామర్ గా కనిపించారు. ఇదిలా ఉంటే ఇప్పుడూ త్రివిక్రమ్ సినిమా కోసం ఇప్పుడు మరింత సరికొత్త మేకోవర్ లుక్ లో మహేష్ కనిపిస్తున్నాడు. మరో రెండు వారాలలో మొదలుకానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం తాజాగా గుబురు గడ్డంతో మహేష్ బాబు సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడం జరిగింది. “మహర్షి” సినిమాలో కంటే మరింతగా మహేష్ గడ్డం పెంచారు.
దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడో సినిమా చేస్తున్నారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానున్న తరుణంలో మహేష్ తాజా లుక్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ రెండు సినిమాలు చేయడం జరిగింది. అతడు, ఖలేజా.. రెండు సినిమాలలో కూడా నటన పరంగా మహేష్ నీ చాలా వైవిధ్యంగా త్రివిక్రమ్ చూపించడం జరిగింది.
“అతడు”లో చాలా సైలెంట్ గా ఉంటే “ఖలేజా”లో చాలా సేటరికల్ కామెడీ చేస్తూ మహేష్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు. దీంతో ఇప్పుడు త్రివిక్రమ్ చేయబోయే మూడో సినిమాలో మహేష్ నీ ఏ రకంగా చూపిస్తాడు అన్నది సస్పెన్స్ గా నెలకొంది. ఇదిలా ఉంటే మరో వారం రోజుల్లో మహేష్ బాబు పుట్టినరోజు నేపథ్యంలో… ఈ సినిమాకి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం టైటిల్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు టాక్.