ఈ సీఈఓ కత్తిలా ఉన్నాడు

Share

ఘట్టమనేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు మహర్షి సినిమా సెకండ్ లుక్ వచ్చేసింది. టీజర్ గా కనిపించిన మహేష్, సెకండ్ లుక్ ఎలా ఉంటాడు? ఏం చేస్తుంటాడు లాంటి సందేహాలకు పలుకుతూ, ముందెన్నడూ చూడనంత స్టైల్ గా, అల్ట్రా పోష్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. సీఈఓ ఇంత అందంగా ఉంటాడు అనిపించేలా చేసిన ఈ స్టిల్ అమెరికాలో తెరకెక్కిన సన్నివేశాల నుంచి విడుదల చేశారు. ఈ ఒక్క పోస్టర్ తో బయటకి వచ్చిన ఘట్టమనేని అభిమానులు, సామి వచ్చాడంటూ సోషల్ మీడియాలో సునామి సృష్టిస్తున్నారు. ఒక పోస్టర్ కి ఇంత దమ్ము ఉంటుందా అనే స్థాయిలో మహేశ్ ఫ్యాన్స్, ఈ సెకండ్ లుక్ ని వైరల్ చేస్తూ తమ సత్తా చాటుతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ లీక్ అయిన ఫొటోస్ తోనే అభిమానులని అలరించిన మహర్షి, రిషి అనే ఒక వ్యక్తి లైఫ్ జర్నీగా తెరకెక్కుతుంది. ఈ ఒక్క పోస్టర్ లోని మహేష్ లుక్ చాలు, సినిమా ఎలా ఉండబోతుందో చెప్పడానికి. స్నేహితుడి కోసం మహేష్ బాబు కనిపిస్తుండగా అతని సరసన పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తుంది. డెహ్రాడూన్ షెడ్యూల్ తర్వాత, అమెరికా షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న మహర్షి, రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన విలేజ్ సెట్ లో షూటింగ్ జరుపుకున్నాడు. ఈ షెడ్యూల్ నుంచి ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేలా ఈ సినిమా గురించి ఓ ఇంట్రేస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది అదేంటి అంటే, సక్సస్ ఫుల్ గా కంప్లీట్ అయిన ఈ షెడ్యూల్ లో తెరకెక్కించిన ఫైట్ సీన్ సినిమాకే హైలైట్స్‌గా నిలవబోతుందట. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఈ ఫైట్, సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ పై భారీ హైప్ పెంచేలా ఉంటుందంట. మహేశ్ అమెరికా వెళ్లడానికి, తిరిగి రావడానికి జస్టిఫై చేసేలా ఉండబోయే ఈ భారీ ఫైట్ సీన్ అల్లరి నరేష్ ఊరిలో ఉండబోతుందని సమాచారం. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రాబోతున్న మహర్షి, సంక్రాంతి తర్వాత ఫోర్త్ షెడ్యూల్ కోసం కేరళ వెళ్లనున్నాడు. అక్కడి సీన్స్ పూర్తి అయితే దాదాపు 75%షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని చిత్ర వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనా 2018 సమ్మర్ లో కాసుల వర్షం కురిపించిన మహేశ్, 2019 మహర్షిగా మరోసారి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ సృష్టించడానికి సిద్దమవుతున్నాడు


Share

Related posts

Acharya : ఆచార్య లో స్టార్ కమెడియన్..మెగాస్టార్ పట్టుపట్టి ఒప్పించాడట..!

GRK

Vakeel saab : వకీల్ సాబ్ సవాల్‌ని తట్టుకోవడం కష్టమేనా..?

GRK

Nabha Natesh New Gallerys

Gallery Desk

Leave a Comment