సినిమా

SVP: “సరిలేరు నీకు ఎవరు” ఎఫెక్ట్ … మహేష్ “సర్కార్ వారి పాట” కి కుమ్మేసాడు అంట..!!

Share

SVP: 2020లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయినా ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే… రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ క్రమంలో గతంలో.. తాను నటించిన సినిమాలలో పెద్దగా వెయ్యని స్టెప్పులు… “సరిలేరు నీకెవ్వరు”లో “మైండ్ బ్లాక్ సాంగ్” లో లుంగీ కట్టుకుని మహేష్ వేసిన స్టెప్పులకి థియేటర్ల లో భారీ రెస్పాన్స్ వచ్చాయి. మహేష్ అభిమానులు బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సాంగ్ కోసం అప్పట్లో ఫాన్స్ థియేటర్ లకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయ్. ఈ విషయం గురించి సినిమా విజయం తర్వాత సక్సెస్ సమావేశాలలో.. మహేష్ కూడా తెలియజేస్తూ ఆశ్చర్యపోయాడు. Mahesh Babu's 'Sarkaru Vaari Paata' Release Likely To Get Postponed; Here' Why

దీంతో ఇప్పుడు “సర్కార్ వారి పాట” లో మాస్ సాంగ్ లో… మహేష్ బాబు… ఇరగదీసే స్టెప్పులు వేశాడు అంట. ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో మహేష్ బాబు… హీరోయిన్ కీర్తి సురేష్.. ఈ మాస్ సాంగ్ లో వేసిన స్టెప్పులకి ఖచ్చితంగా థియేటర్ నుండి భారీ రెస్పాన్స్ వస్తుందని.. అభిమానులు మరోసారి ఎంజాయ్ చేస్తారని ఫిలిం నగర్ టాక్. మైండ్ బ్లాక్ సాంగ్ కోసం లుంగీ కట్టిన మహేష్ “సర్కారు వారి పాట”లో మాస్ సాంగ్ కోసం… జీన్స్ ప్యాంట్ కి కర్చీఫ్ కట్టి…స్టెప్ లు వేయటం జరిగింది. Sarkaru Vaari Paata Mass Song: కాలుకి కర్చీఫ్‌తో సాంగ్‌ షూటింగ్‌లో మహేష్‌.. మాస్‌ సాంగ్‌లకే నెక్ట్స్ లెవల్‌..

ఇదిలా ఉంటే ఈ సాంగ్ ఏప్రిల్ 28 వ తారీకు విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్టు సమాచారం. మే 12 తారీకు విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మే మొదటి వారం నుండి స్టార్ట్ చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా “పోకిరి” తరహాలో విజయం సాధిస్తుందని.. మహేష్ పలుమార్లు “సర్కారు వారి పాట” గురించి చెప్పడంతో ఈ సినిమా పై అభిమానులకు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Share

Related posts

Vijay Devarakonda – Samantha: విజయ్ దేవరకొండ టాలెంట్‌కు సమంత ఫిదా …ఏం చేసిందో చూడండి..

GRK

తండ్రిని చూసి అసూయ చెందుతున్న మంచు విష్ణు

Teja

Srushti Dange Latest Gallerys

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar