Mahesh – Bunny : టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బన్నీ- మహేష్ సినిమాల మధ్య పోటీకి గత కొంత కాలం నుండి నడుస్తూనే ఉంది. ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అవటంతో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య నువ్వా నేనా అనే పోటీ కూడా సోషల్ మీడియాలో నెలకొంది.
గత ఏడాది ఇద్దరు నటించిన సరిలేరు నీకెవ్వరు – అలా వైకుంఠపురం లో సినిమా రెండూ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా బరిలోకి దిగాయి. సినిమా థియేటర్ ల కోసం రెండు సినిమాల నిర్మాతలు..ఎక్కడా కూడా తగ్గని పరిస్థితి. ఆ తరహాలో ఈ సినిమాలు రిలీజ్ అవగా చివరాకరికి అల్లు అర్జున్ నటించిన “అలా వైకుంఠపురం లో” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరూ నటిస్తున్న సినిమాలు మరోసారి పోటీకి దిగుతున్నట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న టాక్. మేటర్ లోకి వెళితే ప్రస్తుతం మహేష్ బాబు గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తూ ఉన్నారు. అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్ల పై ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో.. అల్లు అర్జున్ “పుష్ప” సినిమాని ఆగస్టులో రిలీజ్ చేయాలని మొదట భావించగా ప్రస్తుత పరిస్థితి బట్టి డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్. ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా చేస్తున్న నేపథ్యంలో ఫన్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మహేష్ ఎలాగో సంక్రాంతికి రిలీజ్ చేయాలని అదే ప్లానింగ్ తో ప్రస్తుతం సినిమా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. కానీ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశంలో అలజడి పుట్టిస్తున్న నేపథ్యంలో.. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టులో సినిమా రిలీజ్ అయినా కనెక్షన్లు వచ్చే పరిస్థితులు ఉండవని పుష్ప సినిమాని ఈ ఏడాది చివర్లో గానీ వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ ఆలోచన చేస్తున్నట్లు టాక్.