సినిమా

SVP: “సర్కారు వారి పాట”కి ప్యాకప్ చెప్పేసిన మహేష్ .. వెంటనే మరో డెసిషన్..??

Share

SVP: “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో మహేష్ నటించిన సర్కార్ వారి పాట మే 12వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చాలా కొత్తగా కనిపిస్తూ ఉండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా తమన్ అందించిన పాటలు అదరగొట్టడంతో ఉన్న కొద్ది అంచనాలు డబల్ త్రిబుల్ అయ్యాయి. మరోపక్క కొన్ని ప్రైవేటు కార్యక్రమాలలో సర్కారు వారి పాట తన కెరీర్లో మరో పోకిరి అవుతుందని స్వయం మహేష్ బాబు ప్రకటించడంతో… సినిమా రిలీజ్ కోసం అభిమానులు భారీ ఎత్తున వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఏప్రిల్ 22 వ తారీఖు నాడు సర్కారు వారి పాట చివరి షెడ్యూల్ మహేష్ కంప్లైంట్ చేశారు. Trivikram and Mahesh Babu lock Ireland for SSMB28 - TeluguBulletin.com

ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు చివరి షెడ్యూల్లో మహేష్ బాబు మాస్ పాటకి స్టేపులు వేసి కంప్లీట్ చేసినట్లు తెలిపారు. మే 12వ తారీకు సినిమా రిలీజ్ నేపథ్యంలో మే మొదటి వారం నుండి… సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరిపే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న మహేష్ సర్కారు వారి పాట తో కూడా మరో బ్లాక్ బస్టర్ అందుకోవటం గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Sarkaru Vaari Paata Teaser: Fans Celebrate The Actor's New Avatar

ఇదిలా ఉంటే మరికొద్ది రోజుల్లో త్రివిక్రమ్ సినిమా మా షూటింగ్ ముందుగానే స్టార్ట్ చేయాలని మహేష్ తాజాగా డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. జూన్ నెల చివరిలో స్టార్ట్ చేయాలని మొదటి సినిమా యూనిట్ భావించగా… దానికంటే ముందే సినిమా ప్రారంభించాలని తాజాగా మహేష్ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో మహేష్ నటించిన అతడు, కలేజా రెండు ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేయడం తో వస్తున్న మూడో సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Share

Related posts

Teja Sajja: తేజ సజ్జ “ఆగలేకపోతున్నా”డట..

bharani jella

Breaking: పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా టైటిల్ పేరు “భగత్ సింగ్”..??

sekhar

అంధాదున్ రీమెక్ లో టబు అనుకున్నారు.. కుర్రాళ్ళు రెడీ అయ్యారు.. కాని అంతకంటే సూపర్ హీరోయిన్ ని తీసుకొస్తున్నారు ..!

GRK