Bheemla Naayak: “బీమ్లా నాయక్” ఫిబ్రవరి 25వ తారీకు విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత “గబ్బర్ సింగ్” తరహాలో సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో చాలా మంది పవన్ కళ్యాణ్ కి “బీమ్లా నాయక్” చిత్ర బృందానికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా “బీమ్లా నాయక్” విజయం సాధించడం పట్ల సినిమా యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ అని పొగిడారు.
డానియల్ శేఖర్ గా రానా… అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ తో… అద్భుతమైన పెర్ఫార్మెన్స్.. చేశారని కితాబిచ్చారు. మహేష్ పెట్టిన పూర్తి కామెంట్ ఈ రీతిగా ఉంది..”భీమ్లా నాయక్ క్యారెక్టర్ లో ఫుల్ ఫైర్ తో నిప్పులు చెరిగే తీవ్రతతో, ఎగిసే జ్వాలలా పవన్ కల్యాణ్ కనిపిస్తే… డేనియల్ శేఖర్‌గా రానా సెన్సేషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తెరపై అద్భుతంగా నటించారు. ఎప్పట్లాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ తన పెన్ పవర్ ద్వారా రాసిన డైలాగులు అద్భుతంగా వచ్చాయి.
ఇటీవల కాలంలో త్రివిక్రమ్‌కు ఇదే అత్యుత్తమం అని చెప్పాలి. నాకు నచ్చిన సినిమాటోగ్రాఫర్లలో ఒకడైన రవి కె చంద్రన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. తమన్ సంగీతం మనల్ని వెన్నాడుతుంది, మంత్రముగ్ధుల్ని చేస్తుంది.. యావత్ చిత్రబృందానికి అభినందనలు” అంటూ మహేష్ కామెంట్ చేయడం జరిగింది. ఇటీవల మహేష్ బాబు ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యి విజయం సాధిస్తున్న సినిమాలకు తనదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో మహేష్ పాజిటివ్ కామెంట్ చేస్తూ రియాక్ట్ కావడంతో సోషల్ మీడియాలో… మహేష్ కామెంట్లు వైరల్ గా మారాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!