సినిమా

Mahesh Babu: మ‌హేశ్‌కే ఎందుకిలా జ‌రుగుతుంది..? ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం!

Share

Mahesh Babu: `స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు చేస్తున్న చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకు ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌గా.. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు.

భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం మే 12న అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ షురూ చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను మే 2న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు వ‌ద‌ల‌బోతున్న‌ట్లు చిత్ర‌ టీమ్ ప్రకటన చేసింది. కానీ, ఈలోపే ఈ సినిమా ట్రైల‌ర్‌ను లీకుల వీరులు లీక్ చేసేయ‌గా.. అది కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారింది.

వరుస అప్డేట్స్ తో ఆడియెన్స్ లో జోష్ నింపేందుకు ప్రయత్నించిన సర్కారు వారి పాట మేకర్స్ కు ఊహించ‌ని షాక్ త‌గిలిన‌ట్టు అయింది. అయితే మ‌హేష్ సినిమాకు లీకులు ఏమీ కొత్త కాదు. స‌ర్కారు వారి పాట‌కు సంబంధించిన అప్డేట్స్ ను ప్ర‌తి సారి చిత్ర టీమ్ బ‌య‌ట‌కు వ‌ద‌ల‌డానికి ముందే లీకుల వీరులు లీక్ చేస్తూ వ‌స్తున్నారు.

సినిమా పోస్ట‌ర్స్ ద‌గ్గ‌ర నుంచి పాట‌ల వ‌ర‌కు అన్నిటినీ లీక్ చేస్తున్నారు. దీంతో మ‌హేశ్ విష‌యంలోనే ఎందుకిలా జ‌రుగుతుంది.. చిత్ర టీమ్ ఎందుకింత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంది అంటూ ఆయ‌న ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలానే ఉంటే విడుద‌ల‌కు ముందే సినిమాను సైతం లీక్ చేస్తార‌ని చుర‌క‌లు అంటిస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా మేక‌ర్స్ అప్ర‌మ‌త్తం అవుతారో..లేదో.. చూడాలి.

 


Share

Related posts

Prabhas: తన పెళ్లి ఎందుకు లేట్ అవుతుందో క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్..!

arun kanna

Acharya: మెగా మల్టీస్టారర్ నుంచి మరో ట్రైలర్..ఎందుకంటే…!

GRK

Aacharya: “ఆచార్య” లో కాజల్ క్యారెక్టర్ పై కొరటాల క్లారిటీ..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar