Rajamouli Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “గుంటూరు కారం” టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. “గుంటూరు కారం” అయిన వెంటనే మహేష్ రాజమౌళితో సినిమా చేయబోతున్నట్లు అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో డైరెక్టర్ తెరపైకి రావటం జరిగింది. ఆయన మరెవరో కాదు అనిల్ రావిపూడి. గతంలో మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు అనే సినిమాని ఆరు నెలలలో కంప్లీట్ చేయడం జరిగింది.
ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ప్రస్తుతం మహేష్ బాబుతో చేయబోతున్న రాజమౌళి సినిమా స్క్రిప్ట్ లేట్ అయ్యే పరిస్థితి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో డిసెంబర్ నెల కల్లా త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేసి వచ్చే సమ్మర్ లో అనిల్ రావిపూడి సినిమా విడుదల చేసి ఆలోచనలో మహేష్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి బాలకృష్ణతో భగవంతు కేసరి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా దసరా పండుగకు విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మహేష్ ప్రాజెక్టు అంత ఓకే అయితే డిసెంబర్ నెల నుండి షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే సమ్మర్ కి సినిమా విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.
అంతా ఓకే అయితే అనిల్ సుంకర ఈ సినిమా నిర్మించనున్నట్లు సమాచారం. రాజమౌళి సినిమా అంటే కనీసం మూడు సంవత్సరాలు టైం పట్టే అవకాశం ఉండటంతో.. గుంటూరు కారం విడుదలైన తర్వాత వచ్చే గ్యాప్లో సినిమా చేసేయాలని మహేష్ ఫుల్ గా డిసైడ్ అయ్యారట. ఈ లెక్క వేసుకునే త్రివిక్రమ్ సినిమా ఒప్పుకుంటే అది వాయిదాల పడుతూ రావడం జరిగింది. తక్కువ సమయంలో చాలా త్వరగా తీసే దర్శకుడు అనిల్ రావిపూడి కావటంతో ఓ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేయడానికి మహేష్ రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.