సూపర్‌స్టార్ మహేష్, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం ‘మహర్షి’. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మహేష్ 25వ సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, అశ్వినీదత్, పివిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులే బాకీ ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఎప్పటి నుండో జరుగుతుండటంతో.. ఈ కార్యక్రమాలు పూర్తి కావడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. సినిమా మే 9న విడుదలవుతుంది.
previous post
next post