NewsOrbit
Entertainment News సినిమా

SSMB28: మహేష్…త్రివిక్రమ్ సినిమా నుంచి కొత్త ఫోటో లీక్..!!

Share

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా ప్రారంభించిన సమయంలో ఈ ఏడాది ఏప్రిల్ 28వ తారీకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ సినిమా షూట్ స్టార్ట్ అయ్యాక మహేష్ బాబు తల్లి ఇందిర తర్వాత తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో షూటింగ్ చాలాసార్లు ఆగిపోవడం జరిగింది. ఇదే సమయంలో హీరోయిన్ పూజ హెగ్డే కాలికి గాయం కావడంతో కూడా కొన్నాళ్లపాటు ఆమె రెస్టు తీసుకోవలసి వచ్చింది. మొదటి షెడ్యూల్ అక్టోబర్ నెలలో ప్రారంభమైంది. రెండో షెడ్యూల్ ఈ ఏడాది సంక్రాంతి పండుగ తర్వాత స్టార్ట్ అయింది.

Mahesh New photo leak from Trivikram movie

అప్పటినుండి ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ షాపింగ్ మాల్ లో షూట్ జరుపుకుంటూ ఉంది. అందుకు సంబంధించి త్రివిక్రమ్, మహేష్, పూజ హెగ్డే ఫోటో లీక్ అయ్యింది. ఈ ఫోటోలో సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఫోటోలో పూజ హెగ్డే చాలా సాంప్రదాయ పద్ధతి కలిగిన దుస్తులలో కనిపిస్తుంది. త్రివిక్రమ్ సీన్ వివరిస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుంది. ఇదిలా ఉంటే ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31 వ తారీఖు నాడు మహేష్ తన కొత్త సినిమా అప్ డేట్ ఇవ్వటం సెంటిమెంట్. అయితే ఈసారి తండ్రి కృష్ణ మరణించాక వస్తున్న మొదటి బర్త్ డే కావటంతో… త్రివిక్రమ్ సినిమా టైటిల్ తో పాటు రాజమౌళి సినిమా అప్ డేట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Mahesh New photo leak from Trivikram movieమహేష్ కెరియర్ లో త్రివిక్రమ్ తీసిన అతడు, ఖలేజా రెండు కూడా చాలా వైవిధ్యమైన సినిమాలు. మహేష్ లో ఉన్న సరికొత్త నటుడిని తెరపై చూపించిన సినిమాలు. థియేటర్ లో ఆడకపోయినా గానీ… టీవీలలో ఇప్పటికీ ఈ సినిమా లకు మంచి టిఆర్పి రేటింగ్స్ వస్తాయి. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చాలాకాలం తర్వాత త్రివిక్రమ్ సినిమా కోసం మహేష్ సిగరెట్ తాగుతున్నారు. గతంలో సిగరెట్ తాగటం మానేసినట్లు మహేష్ చెప్పడం జరిగింది. అయితే స్టోరీలో క్యారెక్టర్ డిమాండ్ చేయటంతో మహేష్ మళ్ళీ సిగరెట్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.


Share

Related posts

ద‌స‌రాకు నాని `ద‌స‌రా` నుండి రాబోతున్న సాలిడ్ ట్రీట్‌!

kavya N

Devatha Serial: రేటింగ్ లో తగ్గని దేవతా సీరియల్..! మాధవ్ నిజస్వరూపం రాధకి తెలుస్తుందా..!?

bharani jella

అంచనాలు పెంచుతున్న మంచు విష్ణు – కాజల్ అగర్వాల్ ల మోసగాళ్ళు ..!

GRK