మ‌హేష్ జ‌త‌గా…

ఫిదా చిత్రంతో భానుమ‌తిగా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుని దోచుకున్న త‌మిళ పొన్ను సాయిప‌ల్ల‌వి. ఈ అమ్మ‌డు త‌ర్వాత `ఎం.సి.ఎ`, `క‌ణం`, `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు`  సినిమాల్లో నటించింది. త‌మిళంలో మారి 2లో న‌టించింది. సూర్య‌తో న‌టించిన ఎన్‌.జి.కె విడుద‌ల కావాల్సి ఉంది. ఇప్పుడు ఈ అమ్మ‌డుకి సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నాయి సినీ వ‌ర్గాలు. మ‌హేష్‌, అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిప‌ల్ల‌వి పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు  స‌మాచారం. జూలైలో సినిమాను ప్రారంభించి వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నార‌ట‌. అనీల్ సుంక‌ర‌తో పాటు జి.ఎం.బి ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ మ‌హ‌ర్షి చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఏప్రిల్ 25న `మ‌హ‌ర్షి` విడుద‌ల‌వుతుంది.