మహేష్ తన సినిమా రిలీజ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదట.. ఇంతకు మహేష్ అంత పట్టు పడుతున్న సినిమా ఏదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. `మహర్షి` సినిమా గురించే.. ముందుగా సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ సినిమా పూర్తి చేయలేమని తెలియడంతో.. ఏప్రిల్ 25కి సినిమాను వాయిదా వేశారు. అయితే అదే నెలలో సాయిధరమ్ తేజ్ `చిత్రలహరి`, నాని జెర్సీ` సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ రెండు సినిమాలను నైజాం, వైజాగ్ ఏరియాల్లో నిర్మాత దిల్రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. మహేష్ సినిమాను ఓ వారం, రెండు వారాల గ్యాప్లో విడుదల చేస్తే డిస్ట్రిబ్యూటర్గా దిల్రాజు నష్టపోయే అవకాశాలున్నాయి. అలాగే ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు కూడా ఉంటాయి. ఆ ఎఫెక్ట్ కూడా సినిమాపై పడుతుందేమో అని కూడా భావించాడు. కాబట్టి మహర్షి సినిమాను జూన్లో విడుదల చేద్దామని అనుకున్నాడు. అయితే మహేష్ అందుకు ససేమిరా అన్నాట్ట. సినిమాను ఏప్రిల్ 25 నాటికి విడుదల చేయాల్సిందేనని చెప్పడంతో దిల్రాజు సరేననక తప్పలేదు. అందుకు తగినట్లుగా అధికారిక సమాచారాన్ని కూడా ఇచ్చారు.
previous post
next post
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!