ఇండియన్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2, “RRR” రెండు కూడా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్నయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రాజమౌళి సినిమా అంటూ ఒక బ్రాండ్ పడిపోయింది. దీంతో ఇండస్ట్రీలోనే అత్యంత భారీ క్రేజ్ ఉన్న హీరో మహేష్ బాబుతో జక్కన్న ఇప్పుడు సినిమా చేయడానికి రెడీ అవ్వడం సంచలనంగా మారింది.
ఇప్పటికే రాజమౌళి ఈ ప్రాజెక్టుకు సంబంధించి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో స్టోరీ డిస్కషన్ లో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా విదేశాలలో భారీ విజువల్ స్టూడియోస్ లనీ ఇన్వాల్వ్ చేయడానికి జక్కన్న ఇప్పటికే పారిస్ వంటి దేశాలకి వెళ్లడం జరిగింది. అడ్వెంచర్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తేరకెక్కనున్నట్లు సమాచారం. అయితే సినిమా షూటింగ్ వాస్తవానికి జనవరి ఆ టైంలో స్టార్ట్ చేస్తారని మొన్నటిదాకా వార్తలు వచ్చాయి.
అయితే ప్రస్తుతం స్టొరీ స్క్రిప్ట్ విషయంలో టైం ఎక్కువ పట్టే అవకాశం ఉందట. దీంతో జనవరి ప్రారంభంలో అధికారికంగా సినిమా ప్రకటన చేయనున్నట్లు ఆ తర్వాత షూటింగ్ విషయానికొస్తే వేసవి నుండి స్టార్ట్ చేసే ఆలోచనలో రాజమౌళి రెడీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు వచ్చే నెల నుండి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారు. సినిమా సంక్రాంతికి లేదా వేసవిలో వచ్చే అవకాశం ఉంది. దీంతో త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే మహేష్ రాజమౌళి ప్రాజెక్టుతో బిజీ కానున్నట్లు సమాచారం.