33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Mahesh Babu: గల్లా అశోక్ రెండో సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన వెంకటేష్ ఆల్ ది బెస్ట్ చెప్పిన మహేష్..!!

Share

Mahesh Babu: తెలుగు చలనచిత్ర రంగంలో పెద్ద కుటుంబాలలో ఘట్టమనేని ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ ఫ్యామిలీ నుండి మొట్టమొదట స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ మార్క్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ తర్వాత మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరిలో మహేష్ క్లిక్ అయ్యి ఇప్పుడు సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. ఆ తర్వాత హీరో సుధీర్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఘట్టమనేని ఫ్యామిలీకి.. గల్లా కుటుంబంకీ బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. గల్లా జయదేవ్ మహేష్ సోదరిని పెళ్లి చేసుకోవడం జరిగింది.

Mahesh said Venkatesh all the best when he attended the opening ceremony of Galla Ashok's second film

ఈ క్రమంలో గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ గతంలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కాక ఇప్పుడు ఆయన రెండో సినిమా హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమా ముహూర్తం షాట్ ఆదివారం చిత్రీకరించారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి నమ్రత శిరోద్కర్ కెమెరా స్విచాన్ చేయగా, విక్టరీ వెంకటేశ్ క్లాప్ కొట్టారు. బోయపాటి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా మేనల్లుడు అశోక్ గల్లా గురించి సోషల్ మీడియాలో మహేష్ ఆనందం వ్యక్తం చేశారు. నీ కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్. నీ ప్రతి సినిమా విజయం సాధించాలని ఎల్లప్పుడూ కోరుకుంటాను అని.. మహేష్ కామెంట్ చేయడం జరిగింది.

Mahesh said Venkatesh all the best when he attended the opening ceremony of Galla Ashok's second film

అశోక్ గల్లా డబ్యూ మూవీ “హీరో” 2022 సంక్రాంతి పండుగకు విడుదల చేశారు. క్రైమ్ అండ్ యాక్షన్ త్రిల్లర్ నేపథ్యంలో దొరకెక్కిన ఈ సినిమా పరవాలేదు అనిపించింది. కమర్షియల్ గా ఆకట్టుకున్న అశోక్ గల్లాలో టాలెంట్ ఉందని నిరూపించింది. మొదటి సినిమాలో డాన్సులు మరియు ఫైట్స్ పరంగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో మొదటి సినిమా విడుదలైన ఏడాది తర్వాత ఇప్పుడు రెండో సినిమాతో అలరించడానికి రెడీ అయిన అశోక్ గల్లానీ మహేష్, వెంకటేష్, బోయపాటి శ్రీను, నమ్రత శిరోద్కర్, ప్రశాంత్ వర్మ లాంటివారు వచ్చే ఆశీర్వదించడం జరిగింది.


Share

Related posts

ద‌స‌రా బ‌రిలోకి గోపీచంద్ `చాణ‌క్య‌`

Siva Prasad

BREAKING: హీరో గా సిద్ శ్రీరామ్ ! చాలా పెద్ద డైరెక్టర్ తో సినిమా సంతకం పెట్టాడు !

somaraju sharma

Pushpa Teaser : పుష్పరాజ్ మాస్ లుక్.. పంచ్ డైలాగ్స్ అదుర్స్..!!

bharani jella