Sarkaru Vaari Paata: “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమా వాస్తవానికి సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కావాల్సింది. కానీ అదే సమయంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో మహేష్ తన సినిమాని వాయిదా వేశారు. అయితే ఇంతలోనే కరోనా కేసులు పెరగటంతో “RRR” కూడా వాయిదా పడటం తెలిసిందే. ఇటువంటి తరుణంలో ఇప్పుడు రాబోయే పెద్ద సినిమాలు మొత్తం సమ్మర్ ని గట్టిగా టార్గెట్ చేశాయి. దాదాపు మూడు సమ్మర్ సీజన్ లు.. కరోనా కారణంగా మిస్ కావడంతో ఈసారి మాత్రం.. కసితీరా సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు.
దీంతో ఇప్పటికే “సర్కారు వారి పాట” సినిమా మే 12 వ తారీకు విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి బ్యాలెన్స్.. షూటింగ్ పాట లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేయాలని మహేష్ డిసైడ్ అయ్యారట. దీంతో ఫిబ్రవరి 12వ తారీకు నుండి ఏకధాటిగా.. దాదాపు రెండు వారాల పాటు చివరి షెడ్యూల్ లో… మహేష్ జాయిన్ అవుతున్నారట. ఈ షెడ్యూల్ తో మొత్తానికి.. “సర్కారు వారి పాట” షూటింగ్ మహేష్ కంప్లైంట్ చేయడం జరుగుతుందట.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగల్ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 వ తారీకు.. వదులుతున్న ట్లు సినిమా యూనిట్ తెలపడంతో ఆ పాట కోసం… అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. “కళావతి” అనే సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు తమన్ క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే మార్చి ప్రారంభంలోనే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో మహేష్ .. జాయిన్ అవుతున్నట్లు సమాచారం.
pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాన్…
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…