21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Entertainment News సినిమా

Superstar Krishna: కృష్ణ గుండెపోటుతో హాస్పిటల్ లో ఉన్న టైం లోనే మరో బాబుని కాపాడిన మహేష్..!!

Share

Superstar Krishna: ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుకి  దెబ్బ మీద దెబ్బ పడింది. జనవరిలో అన్నయ్య రమేష్ బాబు, సెప్టెంబర్ నెలలో తల్లి ఇందిరాదేవి రెండు రోజుల క్రితం తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో.. ముగ్గురు మరణాలతో మహేష్ కృంగిపోయాడు. కృష్ణ మరణాన్ని అస్సలు తట్టుకోలేకపోయాడు. ఆదివారం గుండెపోటుతో హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ అయిన కృష్ణ మంగళవారం తెల్లవారుజామున మరణించడం జరిగింది.

Mahesh saved another Babu when Krishna was in the hospital due to heart attack
Superstar Krishna

కృష్ణ మరణ వార్తతో యావత్ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు శోక సంద్రం లోకి వెళ్లిపోయారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే రీతిలో కృష్ణ తీసుకున్న డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలు.. సినిమా ప్రపంచంలో టాలీవుడ్ కీర్తిని పెంచాయి. అటువంటి మహానటుడు… నటశేఖరుడు కృష్ణకి చాలామంది సినిమా పెద్దలు మరియు ప్రముఖ హీరోలు రాజకీయా నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నివాళులు అర్పించారు. అయితే కృష్ణ హాస్పిటల్ లో మరణంతో పోరాడుతున్న సమయంలోనే.. మరోపక్క మహేష్ తన సేవా కార్యక్రమాలను ఎక్కడ ఆపకుండా పనిచేయడం విశేషం. ఈ క్రమంలో గుండెపోటుతో హాస్పిటల్లో కృష్ణ జాయిన్ అయిన రోజే మరో గుండెకు మహేష్ ఊపిరి పోసాడు.

Mahesh saved another Babu when Krishna was in the hospital due to heart attack
Mahesh Babu

మోక్షిత్ సాయి అనే బాబు గుండెకి రంధ్రాలు ఉండటంతో మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా విజయవాడ రమేష్ హాస్పిటల్ లో ఆపరేషన్ చేయించారు. ఆ సర్జరీ సక్సెస్ కావడంతో ఆ చిన్నారి ప్రాణాలు నిలబడ్డాయి. ఒకపక్క తండ్రి గుండె పోటుతో మరణించిన గాని.. మరోపక్క బాబు ప్రాణం నిలబెట్టడం నిజంగా గ్రేట్ అంటూ మహేష్ పై నేటిజన్ లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదే సమయంలో కుటుంబ సభ్యులను కోల్పోవడంతో మహేష్ ధైర్యంగా ఉండాలని మనోధైర్యంతో ముందడుగులు వేసుకుంటూ వెళ్లాలని కోరుతున్నారు.


Share

Related posts

kaniha Family Photos

Gallery Desk

నిజార్ ష‌ఫీ ఇంట‌ర్వ్యూ

Siva Prasad

ప్ర‌భాస్‌ తో సైలెంట్‌గా ప‌ని కానిచ్చేస్తున్న మారుతి.. ఇంత‌కీ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు?

kavya N