సినిమా

SVP: ఆ నలభై నిముషాలు అంటూ “సర్కారు వారి పాట” గురించి కొత్త విషయం చెప్పిన మహేష్..!!

Share

SVP: “సర్కారు వారి పాట” మే 12వ తారీకు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. అంతకు ముందు భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ మరో బ్లాక్ బస్టర్ కి సర్కారు వారి పాట పునాది అవుతుందని సినిమా ప్రారంభంలో సోషల్ మీడియా లో కామెంట్ పెట్టడం తెలిసిందే. ఇక సినిమా చేసిన టైంలో “సర్కారు వారి పాట” తన కెరీర్లో మరో “పోకిరి” లాంటి విజయాన్ని అందిస్తుందని చెప్పుకొచ్చారు.

Mahesh says that close 40 minutes in first half is super

మొన్న సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకలో “సర్కారు వారి పాట”లో హీరో హీరోయిన్ మధ్య నడిచే లవ్ ట్రాక్ కి రేపొద్దున రిపీట్ ఆడియన్స్ ఉంటారని సినిమాపై మరింత అంచనాలు పెంచడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సినిమాకి సంబంధించి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొత్త విషయాన్ని మహేష్ బయటపెట్టాడు. సర్కారు వారి పాట ఫస్టాఫ్ లో 40 నిమిషాల పాటు నడిచే ట్రాక్ సినిమా మొత్తానికి హైలెట్ అని అన్నారు. ఖచ్చితంగా డైరెక్టర్ పరుశురాం ఫలితం అందరికీ నచ్చుతుందని… ఆ నలభై నిమిషాలు చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్.. మళ్లీ మళ్లీ థియేటర్ కి వస్తారు అని సరి కొత్త విషయాలు.. మహేష్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

 

అదే సమయంలో సినిమా ట్రైలర్ భ్రమరాంబ థియేటర్ లో విడుదల చేసిన సమయంలో అభిమానుల నుండి వచ్చిన రెస్పాన్స్ నాకు వీడియో రూపంలో అబ్రాడ్ లో ఉన్నప్పుడు పంపారు. చూసి చాలా షాక్ అయ్యా. ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి ఎంత మంది అభిమానులు రావడం నిజంగా ఆశ్చర్యం అనిపించింది గ్యారెంటీగా సినిమా హిట్ అవుతుంది అంటూ ఇంటర్వ్యూలో మహేష్ చెప్పుకొచ్చారు.


Share

Related posts

క్రేజీ ఓవ‌ర్‌సీస్ ఆఫ‌ర్‌తో `సాహో`

Siva Prasad

KGF 2: 3వ రోజూ అద‌ర‌గొట్టిన‌ `కేజీఎఫ్ 2`.. ఇంకా ఎంత రాబ‌ట్టాలంటే?

kavya N

Chiranjeevi : ఆ డైరెక్టర్ పేరు చెప్తే చిరంజీవికి పూనకం వచ్చేస్తోంది, ఎందుకలా ?

Teja