సినిమా

SVP: తమన్ ఆ రకంగా నన్ను మైండ్ బ్లాక్ చేశాడు మహేష్ వైరల్ కామెంట్స్..!!

Share

SVP: “సర్కారు వారి పాట” ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల మధ్య చాలా కోలాహలంగా జరిగింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మహేష్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులు భారీ ఏర్పాట్లు.. చేయటం మాత్రమే కాదు వేడుక ప్రాంగణంలో రచ్చరచ్చ చేశారు. అభిమానుల అరుపులకు డైరెక్టర్ పరశురామ్ కూడా టెన్షన్ పడిపోయాడు. ఇదిలా ఉంటే ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా యాంకర్ సుమ… మిమ్మల్ని మైండ్ బ్లాక్ చేసిన సందర్భాలు ఈ సినిమాలో ఏంటి అని మహేష్ బాబు అని ప్రశ్నించారు.

mahesh sensational comments on thaman in svp pre release event

డైరెక్టర్ పరుశురాం.. హీరో క్యారెక్టరైజేషన్ వివరించడం బ్లాక్ మాదిరిగా ఉందని తెలిపారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ తమన్… సాంగ్స్ విషయంలో చర్చిస్తున్న క్రమంలో కళావతి మొత్తానికి హైలెట్ అవుతుందని ముందే చెప్పాడు. తమన్ చెప్పినట్టుగానే “కళావతి” సాంగ్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలిచింది. ఆ విషయంలో మాత్రం తమన్ మైండ్ బ్లాక్ ఇచ్చినట్లు అయింది. ఇక హీరోయిన్ కీర్తి సురేష్ సినిమాలో చాలా కొత్తగా నటించింది అదోక మైండ్ బ్లాక్. అంటూ తనదైన శైలిలో మహేష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

ఇక స్పీచ్ లో మహేష్ గతంలో మాదిరిగా కాకుండా.. అభిమానులను బాగా పొగుడుతూ సరికొత్తగా మాట్లాడారు. చివరిలో మహేష్ కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు. రెండు సంవత్సరాలలో చాలా జరిగాయి. నాకు దగ్గరగా ఉండే వాళ్ళు.. చాలామంది దూరమయ్యారు. కానీ మీ అభిమానం మాత్రం చెక్కు చెదరలేదు.. అంటూ అభిమానులను పొగుడుతూ మహేష్ అదరగొట్టే స్పీచ్ ఇచ్చారు. మే 12వ తారీకు మనందరికీ పెద్ద పండగ. సర్కారు వారి పాట రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్ లో చూడండి.. అని తెలియజేయడం జరిగింది.


Share

Related posts

టైటిల్‌కు త‌గ్గ‌ట్టే ఉన్నాడుగా!

Siva Prasad

బిగ్ బాస్ 4 : ఈ వారం కెప్టెన్ కావాలంటే నరకం చూడాల్సిందే..! ఇంతకీ కొత్త కెప్టెన్ ఎవరంటే….

siddhu

Samantha : సమంత శాకుంతలం శరవేగంగా పూర్తవుతోంది..అల్లు అర్హ సీన్స్ అన్నీ కంప్లీట్

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar