SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కార్ వారి పాట” మే 12వ తారీకు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మహేష్ సినిమా విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్ లు కొల్లగొట్టింది. మహేష్ కెరీర్ లో “సర్కారు వారి పాట” బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో నిలిచింది. ఫస్టాఫ్ కామెడీతో సెకండాఫ్… లోతైన స్టోరీ నేపథ్యంతో… అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రీతిలో డైరెక్టర్ పరుశురాం పనితనం చాలావరకు వర్కౌట్ అయింది.
ఒకపక్క సినిమాకి నెగిటివ్ ప్రచారం కొంతమంది హీరోల అభిమానులు అదేవిధంగా కొన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేసినా గాని… “సర్కారు వారి పాట” కలెక్షన్ సునామీ ఎక్కడా తగ్గలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటిటి విడుదల తేదీకి సంబంధించి సరికొత్త వార్త ఇండస్ట్రీలో వినబడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 10వ తారీకు లేదా జూన్ 24 వ తారీకు నుండి “సర్కారు వారి పాట” స్ట్రీమింగ్ కానుంది అని అంటున్నారు.
మే 12వ తారీకు థియేటర్ లో రిలీజ్ అయిన సర్కారు వారి పాట… చాలావరకు కలెక్షన్లు రావడం జరిగింది. రెండు వారాల్లోనే రికార్డు స్థాయి గ్రాస్ రాబట్టిన సినిమాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. దీంతో వచ్చే నెలలోనే ఓటిటి లోకి “సర్కారు వారి పాట” తీసుకురావటానికి నిర్మాతలు డిసైడ్ అయినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వచ్చే నెల నుండి మహేష్ బాబు తన తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం కుటుంబంతో విదేశీ పర్యటనలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…
Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…