జగపతిబాబు అలియాస్ జగ్గూబాయ్ మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. హీరోగా కంటే విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే జగపతిబాబు ఎక్కువగా సంపాదిస్తున్నారు. దక్షిణాది భాషలు సహా హిందీ సినిమాలో బిజీగా ఉన్నారు జగ్గూబాయ్. ఈయన మహేష్‌తో మరోసారి కలిసి నటించబోతున్నారు. వివరాల్లోకెళ్తే.. మహేష్, అనిల్ రావిపూడి కలయికలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. జూన్ నుండి చిత్రీకరణ జరగనుంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో విజయశాంతి నటిస్తుందట. సామాజిక కార్యకర్త పాత్రలో విజయశాంతి నటిస్తుంటే.. జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నాడట. ఈ పాత్ర కోసం జగపతిబాబుని 45 రోజులు కాల్షీట్ కావాలని అడిగారట. జగపతిబాబు కూడా ఈ పాత్రను చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నారని సమాచారం. శ్రీమంతుడు చిత్రంలో మహేష్ తండ్రిగా నటించిన జగపతిబాబు .. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో మహేష్‌తో ఢీ అంటే ఢీ అనే విలన్‌గా మెప్పించనున్నారు. ఈ సినిమా జూన్ నుండి ప్రారంభం కానుందని సమాచారం. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది.
previous post
next post
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!