SSMB 29: ఎస్ఎస్ రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా వినబడుతోంది. బాహుబలి, RRR సినిమాలతో తన రేంజ్ తో పాటు భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయి కూడా జక్కన్న పెంచేశాడు. బాహుబలి 2 తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అన్ని రికార్డులు బ్రేక్ చేయడం తెలిసిందే. ఆ తర్వాత “RRR” తో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. బ్యాక్ టు బ్యాక్ ఈ రెండు సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 1000 కోట్లు కలెక్షన్స్ సాధించిన సినిమాలు తీసిన దర్శకుడిగా రాజమౌళి పేరు సంపాదించారు. “RRR” విజయంతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది.

దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ సినిమా ఉత్సవాలకు జక్కన్నకి ఆహ్వానాలు అందటం తోపాటు.. “RRR”కి మూడు అంతర్జాతీయ అవార్డులు కూడా రావడం జరిగింది. దీంతో ఇప్పుడు రాజమౌళి నెక్స్ట్ చేయబోయే మహేష్ సినిమాపై భారీ అంచనాలు అంతర్జాతీయంగా ఏర్పడ్డాయి. “SSMB 29″ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ సినిమా స్టోరీ పనులపై సీనియర్ రచయిత విజయేంద్రప్రసాద్ వర్క్ చేస్తున్నరు. ఈ సందర్భంగా మహేష్ రాజమౌళి సినిమాకి సంబంధించి సరికొత్త అప్డేట్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ ప్రాజెక్టు ఒక ఫ్రాంచైజీగా తెరకెక్కుతుందని…”SSMB 29” సీక్వెల్స్ ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సీక్వెల్స్ లో కథ మారినప్పటికీ ప్రధాన పాత్రలు అలాగే ఉంటాయని విజయేంద్ర ప్రసాద్ సరికొత్త విషయాన్ని తెలియజేశారు.

వచ్చే ఏడాది స్టార్టింగ్ నుండే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ప్రకటన మీడియా సమావేశం నిర్వహించి.. షూటింగ్ స్టార్ట్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఆ తర్వాత వెంటనే రాజమౌళి సినిమా షూటింగ్ లో మహేష్ జాయిన్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.