Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో… తనలో ఉన్న టాలెంట్ చూపిస్తూ అనేక వీడియోలు చేస్తూ అలరిస్తూ ఉంది. బయట వేడుకలలో చాలా తక్కువ కనిపించే సితార సోషల్ మీడియాలో మాత్రం చాలా రచ్చ రచ్చ చేస్తుంటది. మంచి ఎనర్జిటిక్ గా కనిపిస్తుంటది. డాన్స్ వీడియోలలో చాలా హుషారుగా క్లాసికల్ లేదా సినిమా పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తుంటది. అంత మాత్రమే కాదు కుటుంబంతో ఇతర దేశాలకు వెళ్ళిన సమయంలో అక్కడ అందాలను చూపిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంటది.
ఇదిలా ఉంటే చిన్న వయసులోనే తాజాగా ఒక జ్యువెలరీ యాడ్ చేయడం జరిగింది. ఈ ఒక్క యాడ్ కి దాదాపు కోట రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడం జరిగిందట. ఈ యాడ్ ను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లోని బిల్ బోర్డుపై కూడా ప్రదర్శించడం జరిగింది. ఇటువంటి యాడ్స్ కి ఏ హీరోయిన్ కి కూడా అంత రెమ్యూనరేషన్ ఏ సంస్థ ఇవ్వదు. కానీ మహేష్ బాబు కూతురు కావడంతో ఆ జువెలరీ సంస్థ ఎంత భారీ మొత్తంలో ఆమెకు ఆఫర్ చేయడం జరిగిందంట. దీంతో సితార పేరు మారుమొగుతుంది.
సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వకుండానే ఈ రేంజ్ లో దూసుకుపోవటం హర్షణీయమని అంటున్నారు. ఇంస్టాగ్రామ్ లో సితార కి వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో సితార స్క్రీన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఏడాది మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” సినిమాలో ఓ సాంగ్ ప్రమోషన్ కార్యక్రమంలో సితారా స్టెప్పులు వేయడం జరిగింది. ఆ సాంగ్ సినిమాకి చాలా హైలెట్ గా నిలిచింది. ఏదేమైనా మహేష్ బాలనటుడిగా అప్పట్లో రఫ్ ఆడించాడు. ఇప్పుడు అదే రీతిలో ఆయన కూతురు సితార కూడా చలాకీగా రాణించటం పట్ల ఘట్టమనేని ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.