21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Entertainment News సినిమా

Superstar Krishna: ఫస్ట్ టైం “లవ్ యు నాన్న” అంటూ.. మహేష్ ఎమోషనల్ పోస్ట్..!!

Share

Superstar Krishna: ఈనెల 15వ తారీకు సూపర్ స్టార్ కృష్ణ తుది శ్వాస విడవటం తెలిసిందే. అనారోగ్య కారణాల రీతిలో.. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మరణించారు. కృష్ణ మరణంతో యావత్ ఇండస్ట్రీతో పాటు సినీ ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు నివాళులు అర్పించారు. ఇంకా ఇండస్ట్రీకి చెందిన టాప్ మోస్ట్ హీరోలు కూడా కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇదే సమయంలో అభిమానులు ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు చుట్టుప్రక్కల రాష్ట్రాల్లో ఉన్న వాలు సైతం.. కడసారి తమ అభిమాన నటుడిని చూడటానికి.. భారీ ఎత్తున రావడం జరిగింది.

Image

తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణంతో మహేష్ బాబు కన్నీరు మున్నీరయ్యాడు. ఓకే ఏడాదిలో తల్లి అన్నయ్య ఇక తండ్రి కృష్ణ నీ పోగొట్టుకోవడంతో.. మహేష్ బాగా కృంగిపోయాడు. ఈ క్రమంలో మహేష్ సోషల్ మీడియాలో తన తండ్రి సూపర్ స్టార్ గొప్పదనం గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది. “మీరు ఒక సంబరాలు కలిగిన జీవితాన్ని జీవించారు. మీరు మా నుండి దూరమైన సమయంలో అదే రీతిలో గౌరవం దక్కించుకున్నారు. అది మీ యొక్క గొప్పతనం. భయం లేని జీవితాన్ని జీవించారు.

Image

డేరింగ్ & డాషింగ్ నిర్ణయాలు తీసుకోవటం మీ సొంతం. మీరే నా స్ఫూర్తి, నా ధైర్యం. మునిపెన్నడూ లేని ధైర్యంతో ఉన్న. ఇప్పుడు మీలాగే నిర్భయంగా ఉన్నాను. మీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను. మీరు గర్వపడేలా చేస్తా. లవ్ యు నాన్న. మీరు నా సూపర్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో మహేష్ ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది. దీంతో మహేష్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.


Share

Related posts

రివ్యూ: ట్రైలర్ తోనే ఒళ్ళు గగురుపాటు కలిగిస్తున్న కీర్తి సురేష్ ‘పెంగ్విన్’

arun kanna

Mahesh: మహేశ్ ఫ్యాన్స్..మీకు బంగారం శుభవార్త…

GRK

బిగ్ బాస్ 4 : అరియానా ఛీ కొట్టింది కానీ దివి ముద్దుపెట్టింది..! అవినాష్ పిచ్చ లక్కీ

arun kanna