సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార అందరికీ సుపరిచితురాలే. జూలై 20వ తారీకు సితార పుట్టినరోజు కావటంతో.. మహేష్ బాబు ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “తెలియకుండానే అప్పుడే పదేళ్లు వచ్చేసాయి. నా ప్రపంచమైన సీతారాకు జన్మదిన శుభాకాంక్షలు లవ్ యు అంటూ బర్తడే విషెస్ తెలియజేసి.. సితార ఫోటో పోస్ట్ చేశారు. మహేష్ బాబు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. మహేష్ బాబు అభిమానుల సైతం భారీగా సితారకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. మంచి ఫాలోయింగ్ కూడా…ఉండటంతో సూపర్ హిట్ సాంగ్ లకు డాన్స్ చేస్తూ అలరిస్తుంటది.
మహేష్ బర్తడే కానుకగా “పోకిరి” రూపంలో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!!
అంతేకాదు కుటుంబంతో విదేశాలకు వెళ్లిన సమయంలో అక్కడ దిగే ఫోటోలను కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సితార కూడా ఫస్ట్ టైం పాల్గొనటం సంచలనం రేపింది. “సర్కారు వారి పాటలో” పెన్నీ సాంగ్ రిలీజ్ అయిన సమయంలో సితార ఈ పాటకి ప్రమోషన్ డాన్స్ వేయడం సంచలనం అయిపోయింది. సితార ఈ పాటకు వేసిన స్టెప్పులు అప్పట్లో ఎంతో సంచలనం రేపాయి. సితార “పెన్నీ” వీడియో సాంగ్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించింది.
సాంగులో సితార చాలా ఎనర్జిటిక్ స్టెప్పులు వేయడం జరిగింది. ఇదిలా ఉంటే త్వరలో సితార సినిమా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్న సితార.. త్వరలో యాక్టింగ్ నేర్చుకొనున్నట్లు టాక్. ఇక మహేష్ సినిమా విషయానికొస్తే నెక్స్ట్ త్రివిక్రమ్ తో చేయబోయే ప్రాజెక్ట్ ఆగస్టు రెండో వారం నుండి షూటింగ్ స్టార్ట్ కానుంది. దాదాపు 11 సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా వస్తూ ఉండటంతో మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది.