SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు టైం ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తోంది. గత నాలుగు సంవత్సరాల నుండి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ మహేష్ బాబు అందుకుంటున్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్న మహేష్ కరోనా తర్వాత “సర్కారు వారి పాట” తో మరో హిట్ అందుకొని.. సరికొత్త కలెక్షన్ లతో దూసుకుపోతున్నాడు. సర్కారు వారి పాట రిలీజ్ అయ్యి మొదటి వారానికి దాదాపు 170 కోట్లకు పైగానే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు సాధించడం జరిగింది. కరోనా తర్వాత… రీజినల్ మూవీ ఈ రీతిలో కలెక్షన్ సాధించటం ఇదే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదంతా పక్కన పెడితే ఇటీవల పికాక్ అనే ప్రముఖ మ్యాగజైన్ కి మహేష్ బాబు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ లో భాగంగా రాపిడ్ ఫైర్ చాలెంజ్ లో ఎదురైనా ప్రశ్నలకు.. మహేష్ బాబు ఆసక్తికరమైన సమాధానాలు ఇవ్వడం జరిగింది. తాను ఎక్కువగా బ్యూటిఫుల్ అనే పదం వాడతాను అని చెప్పుకొచ్చాడు. హాలీవుడ్ మూవీ “లయన్ కింగ్” ఈ సినిమాను చూసి ఏడ్చినట్లు తెలియజేశాడు. ఒకవేళ తాను డైరెక్టర్ అయితే ఒక్కడు సినిమా ని రీ క్రియేట్ చేస్తాం అని తెలిపాడు. తండ్రి కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా తన ఆల్ టైం ఫేవరేట్ అని మహేష్ చెప్పాడు.
ఇదిలా ఉంటే మహేష్ జూన్ నెలాఖరు నుండి.. నెక్స్ట్ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూన్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. గతంలో మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు రావటం ప్రేక్షకులను అలరించడం తెలిసిందే. థియేటర్ లో ఏ సినిమాలు పెద్దగా ఆడకపోయినా గాని టెలివిజన్ లో భారీ ఎత్తున ప్రేక్షకుల ఆదరణ లభించింది. దీంతో దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేయటం..తో.. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!