Major: అడవి శేష్ హీరోగా తెరకెక్కిన “మేజర్” సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కావడం తెలిసిందే. ముంబయి ఉగ్రవాద దాడులు 26/11 కి సంబంధించి ఆ ఘటనలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా దేశభక్తిని ప్రతిబింబించింది. తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయగా విడుదలైన ప్రతిచోట పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని.. కలెక్షన్ ల వర్షం కురిపిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. దేశ సరిహద్దుల వద్ద జవాన్ లపై చూపించే ప్రేమ.. వాళ్ల కుటుంబాల పై కూడా చూపించే దిశగా “మేజర్” సినిమాని డైరెక్టర్ శశికిరణ్ అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
“మేజర్” చూస్తున్నంత సేపు.. ఒక సినిమానే కాకుండా దేశ భక్తిని ప్రతిబింబించే రూపాన్ని.. పోరాటాన్ని.. దేశం కోసం పనిచేసే జవాన్ యొక్క భావోద్వేగాలను ప్రేక్షకుడు అర్థమయ్యే రీతిలో డైరెక్టర్ పనితనం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగా భావోద్వేగానికి గురి అవుతున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్.. ఇంకా చాలామంది క్లైమాక్స్ గురించి సినిమా చూసిన తర్వాత కంటిలో నీళ్లు తిరిగాయని మీడియాతో చెప్పడం జరిగింది. ఇక ఇదే సమయంలో సందీప్ ఉన్ని కృష్ణన్ తండ్రి కె. ఉన్ని కృష్ణన్ కూడా సినిమా చూసిన తర్వాత చాలా భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకు సందీప్ జీవితాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారని సినిమా యూనిట్ నీ అభినందించడం జరిగింది.
“మేజర్” తమకు కలిగిన దుఃఖాన్ని మరిచేలా చేసిందని… నా కొడుకు చివరి వరకు ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసి.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. చాలా గర్వంగా ఉంది. నేను సందీప్ తో హైదరాబాదులో ఉన్నాను. నా కెరియర్ కూడా హైదరాబాద్ లోనే స్టార్ట్ అయింది. నా కుమారుడు తో హైదరాబాదులో చాలా సమయం గడిపాను. ప్రస్తుతం మై బాయ్స్..(మేజర్ సినిమా యూనిట్) తో సమయం గడుపుతున్నాను హైదరాబాదులో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను అని అన్నారు. ఆ తర్వాత సినిమాలో తన క్యారెక్టర్ వేసిన ప్రకాష్ రాజ్ ని మెచ్చుకున్నారు. వెంటనే ప్రకాష్ రాజు కూడా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తండ్రిని ఆప్యాయంగా.. పలకరించటం మాత్రమే కాదు ఆయనకి హగ్ ఇవ్వడం అభినందించడం జరిగింది. “మేజర్” లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చాలామందిని తాకింది. సినిమా డైరెక్టర్ మొదలుకొని ఆడియన్స్ వరకు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ గురించి పొగడ్తల వర్షం కురిపించడం జరిగింది.